Breaking News

కొండంత ధైర్యంతో...

Published on Tue, 12/12/2023 - 00:26

సియాచిన్‌ పేరు వినబడగానే ఒంట్లో చలితోపాటు మృత్యుభయం కూడా దూరుతుంది. శత్రువుల జాడను కనిపెట్టడం ఒక ఎత్తయితే, ప్రకృతే శత్రువుగా మారి ప్రాణాలు కబళించే ప్రమాదకర పరిస్థితి నుంచి బయట పడడం మరో ఎత్తు.
 
దేశం కోసం కొండంత ధైర్యంతో సియాచిన్‌ గ్లాసియర్‌లో విధులు నిర్వహిస్తున్నారు మన సైనికులు. సియాచిన్‌ గ్లాసియర్‌లో విధులు నిర్వహించబోతున్న ఫస్ట్‌ ఉమన్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (ఆపరేషనల్‌ పోస్ట్‌)గా ఫాతిమా వసీమ్‌ చరిత్ర సృష్టించింది...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్‌ గ్లేసియర్‌. గడ్డకట్టే చలిలో మన సైనికుల సాహసం, అంకితభావం మాటలకు అందనివి. సముద్ర మట్టానికి 17,720 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్‌లో శీతాకాలంలో పగలు ఏడు గంటలు మాత్రమే ఉంటుంది. ఆక్సిజన్‌ లెవెల్స్‌ సరిగ్గా ఉండకపోవడంతో సైనికులు ఎక్కువ సమయం నిద్ర పోవడానికి వీలుకాదు. షేవింగ్‌ చేసుకోవాలన్నా కష్టమే. ఒకవేళ చర్మం తెగితే గాయం మానడానికి చాలా సమయం పడుతుంటుంది. స్నానం చేయాలన్న కష్టమే.

ప్రత్యేక చీతా హెలికాప్టర్లు మాత్రమే ఇక్కడికి చేరుకోగలవు. ఇక్కడ మూడు వేలమంది వరకు సైనికులు పనిచేస్తారు. ఒక్కో బెటాలియన్‌ మూడు నెలల వరకు గస్తీ విధులు నిర్వహిస్తుంది. మంచుకొండ చరియలు విరిగి పడడం ద్వారా ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ప్రతికూలత’ గురించి తప్ప ‘అనుకూలత’ గురించి ఒక్క మాట కూడా వినిపించని మృత్యుక్షేత్రంలోకి  మెడికల్‌ ఆఫీసర్‌గా అడుగు పెట్టనుంది కెప్టెన్‌ ఫాతిమా వసీమ్‌.

‘సియాచిన్‌ బ్యాటిల్‌ స్కూల్‌’లో ఎన్నో నెలల పాటు కఠోరమైన శిక్షణ పొందింది ఫాతిమా. ‘సియాచిన్‌ గ్లేసియర్‌పై ఆపరేషనల్‌ పోస్ట్‌లో విధులు నిర్వహించబోతున్న తొలి మహిళా వైద్యాధికారిగా ఫాతిమా వసీమ్‌ ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చింది. ఇది చారిత్రక సందర్భం. కెప్టెన్‌ ఫాతిమా వసీమ్‌ ధైర్యసాహసాలు, అంకితభావాలకు అద్దం పట్టిన సందర్భం’ అంటూ ‘ఎక్స్‌’లో ఇండియన్‌ ఆర్మీ ఒక వీడియోను పోస్ట్‌ చేసింది. ‘ఐసే జాగోరే సాథియో... దునియా సే జాకో బోలుదో’ అనే పాట వినిపిస్తుండగా ‘మీట్‌ కెప్టెన్‌ ఫాతిమా, ఏ సియాచిన్‌ వారియర్‌. ఉయ్‌ సెల్యూట్‌ హర్‌’ అంటూ వీడియో మొదలవుతుంది. ఈ వీడియోలో ‘సియాచిన్‌ బ్యాటిల్‌ స్కూల్‌’లో ఫాతిమా వసీమ్‌ శిక్షణ తీసుకుంటున్న, సైనికులకు వైద్యం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి.
 
∙కెప్టెన్‌
ఫాతిమా వసీమ్‌∙శిక్షణలో...
∙వైద్య
సేవలు
అందిస్తూ

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)