Breaking News

రోజు కూలీ.. విమానం లాంటి ఇంటిని కట్టుకున్నాడు

Published on Mon, 07/17/2023 - 14:48

విమానంలో ప్రయాణించాలనే ముచ్చట చాలామందికే ఉంటుంది. కానీ, అతడికి విమానంలో నివాసం ఉండాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. ఎగిరే విమానంలో నివాసం ఏర్పరచుకోవడం ఎలాగూ కుదిరే పని కాదు కనుక విమానంలాంటి ఇంటిని నిర్మించుకున్నాడు. తన కలల నివాసాన్ని నిర్మించుకోవడానికి కంబోడియాకు చెందిన ఆండ్‌ క్రాచ్‌ పోవ్‌ దాదాపు ముప్పయ్యేళ్లు కష్టపడ్డాడు.

మొత్తానికి ఇన్నాళ్లకు నేలకు ఇరవై అడుగుల ఎత్తున ఎగురుతున్న విమానంలాంటి భవంతిని నిర్మించుకున్నాడు. దీని నిర్మాణం కోసం తన పదమూడో ఏట నుంచి డబ్బు కూడబెట్టడం ప్రారంభించాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఖర్చుల కోసం ఇచ్చిన చిల్లర డబ్బు మొదలుకొని పెద్దయ్యాక భవన నిర్మాణాలు సహా రకరకాల పనులు చేసి 7.84 కోట్ల రియెల్స్‌ (రూ.15.63 లక్షలు) పోగు చేశాడు. ఆ డబ్బుతోనే ఈ ఇంటిని నిర్మించుకుని, తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు.

భవన నిర్మాణంలో అనుభవం ఉన్న పోవ్‌ ఈ ఇంటిని నిర్మిస్తున్నప్పుడు చుట్టుపక్కల జనాలు ఇతడిని ఒక పిచ్చోడిలా చూశారు. నిర్మాణం పూర్తవుతున్న దశలో ఈ ఉదంతం పోవ్‌ నివాసం ఉండే సీమ్‌ రీప్‌ ప్రావిన్స్‌లో సంచలన వార్తగా మారింది. తన ఇంటికి దగ్గర్లోనే ఒక కాఫీ షాపును ఏర్పాటు చేయాలనుకుంటున్నానని, త్వరలోనే అసలు విమానంలో ఎగరాలనే తన కలను కూడా నిజం చేసుకుంటానని పోవ్‌ మీడియాకు చెబుతున్నాడు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)