Breaking News

కాల్షియం లోపంతో బాధపడుతున్నారా ? ఈ పాలు ట్రై చేయండి!

Published on Sat, 11/23/2024 - 13:29

శరీరంలో కాల్షియంది చాలా కీలకమైన పాత్ర. కాల్షియం లోపం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి. కాల్షియం లోపాన్ని సరిచేసేందుకు చాలా మంది రకరకాల మందులు వాడుతుంటారు. అలా కాకుండా ఆహార పానీయాల ద్వారానే కాల్షియం స్థాయులను పెంచుకోవచ్చు. ఆహారం కన్నా కొన్ని రకాలపానీయాలను తాగడం ద్వారా కూడా తగినన్ని పాళ్లలో క్యాల్షియం ఉండేలా చూసుకోవచ్చు. ఆపానీయాలేమిటో తెలుసుకుందాం. 

శరీరంలో కాల్షియం స్థాయిలను పెంచడానికి ఉత్తమపానీయాలు.
వృక్షాధారితం: సాధారణంగా శరీరంలో క్యాల్షియం పెరిగేందుకుపాలు తాగడం మంచిదంటారందరూ. అయితే జంతుసంబంధమైన గేదెపాలలో కన్నా వృక్ష సంబంధమైన బాదం, సోయా వోట్‌ మిల్క్‌లో కూడా క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి వేగన్‌ డైట్‌ తీసుకునేవాళ్లు కూడా నిరభ్యంతరంగా ఈ పాలు తాగవచ్చు.

లీఫీ స్మూతీస్‌: పాలకూర, మెంతికూర, చుక్కకూర వంటి ఆకుకూరలకు అల్లం, సైంధవ లవణం, కొన్ని రకాల పండ్ల ముక్కలు కలిపి తయారు చేసిన స్మూతీస్‌ తాగడం వల్ల శరీరానికి కాలిష్యం సమృద్ధిగా అందుతుంది. 

బోన్‌ సూప్‌: ఎముక ఆరోగ్యం బాగుండాలంటే కాల్షియం అవసరం. అదేవిధంగా ఎముకలకు కాల్షియం సమృద్ధిగా అందాలంటే బోన్‌సూప్‌ తాగడం చాలా మేలు చేస్తుందంటున్నారు పోషకాహార నిపుణులు. 

నువ్వుల పాలు: గ్లాసుపాలలో కన్నా స్పూను నువ్వు గింజలలోనే ఎక్కువ కాల్షియం ఉంటుందట. అయితే నువ్వులను నమిలి తినడం కన్నా నువ్వులను నానబెట్టి రుబ్బి, వడకట్టి తేర్చిన పాలను తాగితే రోజంతటికీ కావలసిన కాల్షియం లభిస్తుంది. 

టోఫు స్మూతీస్‌: సహజంగానే టోఫులో కాల్షియం ఎక్కువగానే ఉంటుంది. అయితే దానిలో కాల్షియం సల్ఫేట్, కొన్ని పండ్ల ముక్కలతో తయారు చేసిన దానిలో కాల్షియం మరింత సమృద్ధిగా ఉంటుంది. 

కొబ్బరినీళ్లు: నీరసంగా ఉన్నప్పుడు, జ్వరపడి కోలుకుంటున్నప్పుడు కొబ్బరినీళ్లు తాగమని చెబుతుంటారు వైద్యులు. కొబ్బరినీళ్లలో ఎలక్ట్రోలైట్స్,  పొటాషియం పుష్కలంగా ఉండటమే అందుకు కారణం. వాటితోపాటు కొబ్బరినీళ్లలో కాల్షియం మోతాదు కూడా తక్కువేం కాదు.

 ఇదీ చదవండి: శీతాకాలంలో కీళ్ల నొప్పులు : నువ్వులను ఇలా తింటే..!


 

ఆవుపాలు: గేదెపాలతో పోల్చితే ఆవుపాలలో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందట. అందువల్ల కాల్షియం లోపించిన వారిని పాలు తాగమని చెప్పినప్పుడు గేదెపాలకన్నా ఆవుపాలకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. 

పై  పానీయాలలో వీలున్నవాటిని తాగుతుండటం వల్ల కాల్షియం లోపం  తొందరగా భర్తీ అవుతుంది.పెరుగు, జున్ను, మజ్జిగ, చియాసీడ్స్, గసగసాలలో కూడా కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇతర ఆరోగ్య పరిస్థితులను బట్టి అందుబాటులో ఉన్న పానీయాలు తాగాలి.  

కాల్షియం లోపంతో బాధపడుతున్నారా ? ఈ పాలు ట్రై చేయండి! 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)