Breaking News

కేక్‌ మిక్సింగ్‌.. గ్రేప్‌ స్టాంపింగ్‌

Published on Mon, 09/30/2024 - 09:54

నగరం విభిన్న సంస్కృతులకు కేంద్రం బింధువు అని ప్రతి ఒక్కరూ చెబుతారు. శతాబ్దాల గత చరిత్ర మొదలు ప్రస్తుత తరం అధునాతన జీవనశైలిని సైతం తనలో ఇముడ్చుకుని భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతిగా విశేష ఆదరణ పొందిన కేక్‌ మిక్సింగ్‌ ఈవెంట్లను సైతం ఘనంగా నిర్వహిస్తోంది మన భాగ్యనగరం. ఈ నేపథ్యంలో నగరంలోని ఎయిర్‌పోర్ట్‌ నోవోటెల్‌ వేదికగా ఆదివారం కేక్‌ మిక్సింగ్, గ్రేప్‌ స్టాంపింగ్‌ కార్యక్రమాలను  నిర్వహించారు. క్రిస్మస్‌ ఈవెంట్లకు రెండు నెలల ముందే మిక్సింగ్‌ మొదలైంది.. 

ఆ వివరాలు తెలుసుకుందాం.. 
క్రిస్మస్‌కి దాదాపు 2 నెలల ముందు కేక్‌ మిక్సింగ్‌ నిర్వహిస్తారు. కేక్‌ మిక్సింగ్‌ దాదాపు 25 రకాల డ్రైఫ్రూట్స్, రమ్, బ్రాందీ, వైన్‌ వంటి లిక్కర్లతో కలిపిన మిశ్రమాన్ని 2 నెలల పాటు సోక్‌ (పులియబెడతారు–ఫర్మంటేషన్‌) చేస్తారు. 60 రోజుల తరువాత ఈ మిశ్రమంతో ప్లమ్‌కేక్‌ తయారు చేస్తారు. క్రిస్మస్‌ వేడుకల్లో ఈ కేక్‌ చాలా స్పెషల్‌. క్రిస్మస్‌కు కొద్ది రోజుల ముందు కేక్‌ మిక్సింగ్‌ చేసి తయారు చేసే కేక్‌లలో రుచి, నాణ్యత ఉండదని నోవోటెల్‌ చెఫ్‌ అమన్న రాజు తెలిపారు. కనీసం 2 నెలలు లిక్కర్‌లో మాగిన డ్రైఫ్రూట్స్‌కు మంచి ఫ్లేవర్‌ అద్దుతుంది. గ్రేప్‌ స్టాంపింగ్‌ (కాళ్లతో ద్రాక్షలను తొక్కుతూ వైన్‌ తయారు చేయడం) కూడా ఇక్కడ ప్రత్యేకం. ఇది ఫ్రాన్స్‌కు చెందిన పురాతన పద్దతి, సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు.  

13 ఏళ్ల నుంచి.. 
నోవోటెల్‌ ఆధ్వర్యంలో 2011 నుంచి కేక్‌ మిక్సింగ్, గ్రేప్‌ స్టాంపింగ్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఇలా ప్రతి ఏడాది డిసెంబర్‌ మొదటి, రెండు వారాల్లో 2 వేల నుంచి 2,500 కేకుల వరకూ చేస్తాం. ఒక కిలో కేక్‌లో ఈ మిశ్రమాన్ని 30 శాతం మాత్రమే వినియోగిస్తాం, మిగతాది క్యారమిల్, ఎగ్, ఫ్లోర్‌ తదితరాలను వినియోగిస్తాం. వైన్‌ తయారీ కోసం ప్రత్యేకంగా నిర్వహించిన గ్రేప్‌ స్టాంపింగ్‌లో విదేశీయులు సైతం పాల్గొని సందడి చేశారు.   
– సుఖ్‌బీర్‌ సింగ్, నోవోటెల్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ జనరల్‌ మేనేజర్‌

వహ్‌.. భారత్‌.. 
నగరం వేదికగా నిర్వహించే ఈ వేడుకల్లో ప్రతి యేటా పాల్గొంటాను. హైదరాబాద్, భారతీయ సంస్కృతి అంటే చాలా ఇష్టం. రష్యా నుంచి నగరానికి వచ్చే పర్యాటకులు చారి్మనార్, బిర్లా మందిర్‌ను తప్పకుండా సందర్శిస్తారు. నాకు ఇష్టమైన వేడుకల్లో ఈ కేక్‌ మిక్సింగ్‌ ముఖ్యమైనది. ఐదేళ్లుగా ఈ వేడుకలకు హాజరవుతున్నా. 
నా పిల్లలకు కూడా ఇక్కడి సంస్కృతిపై మక్కువ.  
– ఎలీనా, రష్యా 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)