Breaking News

బర్నింగ్‌ ది క్లాక్స్‌

Published on Sun, 12/21/2025 - 01:05

కాలాన్ని ఒడిసి పట్టే గడియారాలను దహనం చేయడమే బ్రిటన్‌లోని ‘బర్నింగ్‌ ది క్లాక్స్‌’ ఫెస్టివల్‌ ప్రత్యేకత. బ్రిటన్స్ లోని ససెక్స్‌లో ఉన్న బ్రైటన్‌ నగరంలో ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 21 లేదా 22న జరిగే అద్భుతమైన సామూహిక ఉత్సవమే ‘బర్నింగ్‌ ది క్లాక్స్‌’. ఈ ఏడాది డిసెంబర్‌ 21న ఈ వేడుక జరుగుతుంది. ఇది పాత సంవత్సరాన్ని గౌరవంగా సాగనంపి, రాబోయే కొత్త ఆశలకు, వెలుగులకు స్వాగతం పలికే వేడుక!

ఈ సంప్రదాయ ఉత్సవాన్ని ‘సమ్‌ స్కై’ అనే స్థానిక కళా సంస్థ నిర్వహిస్తుంది. రకరకాల పోటీలు కూడా ఏర్పాటు చేస్తుంది. శీతకాలపు చీకటిని పోగొట్టడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఒకచోట చేర్చడమే ఈ పండుగ ప్రధాన ఉద్దేశం.

సాయంత్రం వేళ జరిగే లాంతర్ల ఊరేగింపు, ఈ ఉత్సవంలో అత్యంత ఆకర్షణీయమైనదని చెప్పొచ్చు. బ్రైటన్‌ స్థానికులు, అక్కడికి వచ్చిన కొందరు ఔత్సాహికులు తమ చేతులతో తయారుచేసిన ప్రత్యేకమైన లాంతర్లను తీసుకుని నగర వీధుల్లో ఊరేగింపుగా నడుస్తారు. వీటిలో ఎక్కువ శాతం గడియారాలు ఉంటాయి. ఈ లాంతర్లను సాధారణంగా కాగితం లేదా వెదురుతో తయారు చేస్తారు. అవి గడియారాలే కాక చంద్రుడు, నక్షత్రాలు, చిత్రవిచిత్రమైన ఎన్నో రూపాలను పోలి ఉంటాయి. ఈ చూడముచ్చటైన దృశ్యంతో వీధులన్నీ మెరుస్తాయి.

ఇక చివరిగా బ్రైటన్‌ సముద్ర తీరం వద్ద ఈ ఊరేగింపు ముగుస్తుంది. అక్కడ, ప్రతి ఒక్కరూ తమ లాంతర్లను ఒక పెద్ద కొయ్యపై వేసి, అగ్నితో దహనం చేస్తారు. గడియారాలు కాలాన్ని సూచిస్తాయి కాబట్టి వాటిని దహనం చేయడమంటే పాత బాధలను, చెడు జ్ఞాపకాలను, గడిచిన కాలాన్ని విడిచిపెట్టడమే అని అక్కడి వారు భావిస్తారు. ఆ తరువాత, బాణాసంచా ప్రదర్శనతో ఆకాశం కాంతులీనుతుంది. చూపరుల మనసు నిండుతుంది.

  • సంహిత నిమ్మన

#

Tags : 1

Videos

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! మెగా కింగ్ కాంబో?

ఎంత దారుణం అంటే.. బాలకృష్ణ, లోకేష్ తో ఫోన్ చేయించి.. RK రోజా సంచలన నిజాలు

నెల్లూరులో స్క్రూటినీ పేరుతో అధికారుల హైడ్రామా

Photos

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)