Breaking News

Dharmakirti గెలిచేది..నిలిచేది ధర్మమే...సత్యమే!

Published on Fri, 05/02/2025 - 11:19

బౌద్ధమతాన్ని తార్కికంగా వివరించిన ప్రముఖ ఆచార్యుల్లో ధర్మకీర్తి ఒకడు. నలందా విశ్వవిద్యాలయంలో ఆచార్య ధర్మపాలునికి శిష్యుడై విద్యను ఆర్జిం భిక్షువయ్యాడు. దేశమంతా పర్యటించి అనేక చర్చల్లో, సదస్సుల్లో, సమావేశాల్లో పాల్గొన్నాడు. వాదంలో ధర్మ కీర్తిచే ఓడింపబడినవారు తమ ఓటమిని హుందాగా అంగీకరించకపోగా అవమానించడానికి పూనుకున్నారు. ఆయన రంన తాళపత్ర గ్రంథాలను సేకరిం, వాటిని కట్టగా కట్టి, కుక్క తోకకు ముడివేసి ఆ కుక్క పరుగులు తీసేట్టు దాన్ని గట్టి గట్టిగా కేకలు వేశారు. భయంతో ఆ కుక్క విచ్చలవిడిగా అటూ, ఇటూ పరుగులు పెట్టింది. దాని తోకకు కట్టిన ధర్మకీర్తి రచనలున్న తాళ పత్రాలు చిందరవందరై గాలి వీచి అన్ని దిక్కులకు ఎగిరిపోయాయి. 

ఆ దృశ్యాన్ని చూసి ధర్మ కీర్తి ప్రత్యర్థులు పగలబడి నవ్వుతూ ధర్మకీర్తిని హేళన చేసి, చులకనగా మాట్లాడారు. ఈ దెబ్బకు ఆయన దిగులు పడి కాళ్ళ బేరానికి వస్తాడని వారు ఆశించారు. కానీ ఆయన చాలా ప్రశాంతంగా, ‘ఈనాడు, ఈ నా గ్రంథాలు ఎలాగైతే అన్ని దిక్కులకు ఎగిరిపోతున్నవో, అలాగే ఒక నాటికి నా భావాలు, నా కీర్తి దశ దిశలకు వ్యాపించి తీరుతుంది’ అన్నాడు. అది అక్షరాలా నిజమైంది. ధర్మమే జయించింది. సత్యమే గెలిచింది.

టిబెట్‌లో నేటికీ బౌద్ధ భిక్షువులు ధర్మకీర్తి రచనలను పరమ ప్రామాణికమైనవిగా భావించి ఆయనను గౌరవిస్తారు. రాహుల్‌  సాంకృత్యాయన్‌ ధర్మకీర్తిని శ్లాఘిస్తూ ‘విమర్శనాత్మకమైన వాదనా పటిమలోనూ, విస్పష్టమైన విశ్లేషణలోనూ, స్పష్టమైన భావుకతలోనూ ఆయనను మించిన వారు లేరు’ అంటారు. ‘న్యాయ బిందు’, ‘హేతుబిందు’ వంటి ఎనిమిది గ్రంథాలు ధర్మకీర్తి కీర్తి ప్రతిష్ఠలను గగనానికి చేర్చాయి.
– రాచమడుగు శ్రీనివాసులు 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)