Breaking News

అమెరికాలో నేరాలు తగ్గించిన బుద్ధుడు!

Published on Sun, 12/17/2023 - 06:50

అమెరికాలో ఒకప్పుడు నేరాలకు పేరుమోసిన ప్రాంతం అది. చుట్టుపక్కల జరిగే నేరాలకు విసిగి వేసారిన ఒక పెద్దమనిషి ఒక బుద్ధుడి విగ్రహాన్ని తీసుకొచ్చి, జనసంచారం బాగా ఉండే రహదారి పక్కన పెట్టాడు. అక్కడే బుద్ధుడి కోసం ఒక చిన్న ఆలయం నిర్మించాడు. రహదారి పక్కన బుద్ధుడిని నెలకొల్పిన తర్వాత అనూహ్యంగా ఆ ప్రాంతంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

ఈ విడ్డూరం కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓక్‌లాండ్‌ నగరం ఈస్ట్‌లేక్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈస్ట్‌లేక్‌ ప్రాంతంలో పదిహేనేళ్ల కిందటి వరకు తరచు నేరాలు జరిగేవి. దుండగులు వీథుల పక్కనే ప్రమాదకరమైన వస్తువులను పడేసేవారు. తరచు చోరీలకు తెగబడుతుండేవారు. ఈ పరిస్థితులతో బాగా విసిగిపోయిన డాన్‌ స్టీవెన్‌సన్‌ అనే పెద్దమనిషి స్థానికంగా ఉన్న ఒక దుకాణం నుంచి బుద్ధుడి విగ్రహాన్ని కొనుక్కొచ్చి, వీథి పక్కనే పెట్టాడు.

బుద్ధుడికి నీడ కల్పించడానికి చిన్న గుడి కట్టాడు. ఇదంతా 2009లో జరిగింది. క్రమంగా జనాలు ఇక్కడి బుద్ధుడిని దర్శించుకుని, ప్రార్థనలు జరపడం మొదలైంది. అప్పటి నుంచి ఈస్ట్‌లేక్‌ ప్రాంతంలో నేరాలు బాగా తగ్గుముఖం పట్టాయి. అప్పటి నుంచి క్రైమ్‌ రికార్డ్స్‌ను గమనిస్తే, ప్రస్తుతం ఈ ప్రాంతంలో నేరాల సంఖ్య 82 శాతం మేరకు తగ్గిపోయినట్లు స్థానిక పోలీసు అధికారులే చెబుతున్నారు.

ఇంతకీ ఇక్కడ బుద్ధుడి విగ్రహం పెట్టిన డాన్‌ స్టీవెన్‌సన్‌ బౌద్ధుడు కాదు సరికదా, మతాలపై విశ్వాసమే లేని నాస్తికుడు కావడం విశేషం. మొత్తానికి పోలీసులు చక్కదిద్దలేని పనిని బుద్ధుడు చక్కదిద్దాడు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)