Breaking News

రైట్‌ బ్రదర్స్‌ విమానాన్ని కనిపెడితే..ఈ బ్రదర్స్‌ కారునే ఏకంగా..!

Published on Thu, 03/21/2024 - 12:47

రైట్‌ బ్రదర్స్‌ విమానాన్న కనిపెడితే..ఈ బ్రదర్స్‌ కారుని హెలికాప్టర్‌గా మార్చారు. అది తమ జీవనోపాధికి ఉపయోగపడుతుందనుకున్నారు. కానీ ఇలా మార్పులు చేయాలంటే అధికారులు అనుమతి తప్పనసరి. అది తెలియక ఈ అన్నదమ్ములూ తయారు చేసిన కారు కమ్‌ హెలికాప్టర్‌ పోలీసులు సీజ్‌ చేయడం జరిగింది. దీంతో అన్నదమ్ములిద్దరు తలలుపట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకెళ్తే..ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు.. పాత మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్‌ను హెలికాప్టర్‌గా మార్చారు. ఈశ్వర్దీన్, పరమేశ్వర్దీన్ అనే ఈ అన్నదమ్ములు.. వివాహాలకు ప్రత్యేకంగా కనిపించేలా కారును హెలీకాప్టర్లా మార్చారు. వధూవరులను తీసుకుని వెళ్లాలా ప్రత్యేకతగా ఉండాలనుకున్నారు. అందుకోసం హెలికాప్టర్ రోటర్ బ్లేడ్‌ను కారు పైకప్పుపై వెల్డింగ్ చేసి అతికించారు. కారు బూట్‌కు హెలీకాఫ్టర్ కు ఉండే తోకను జోడించారు. ఇలా కారు కమ్‌ హెలికాప్టర్‌లా విలక్షణంగా రూపొందిచారు. పైగా దీనివల్ల తమ కుటుంబానికి మంచి జీవనోపాధిగా ఉంటుందనేది వారి ఆలోచన.

ఆ నిమిత్తమే ఈ ఇద్దరు సోదరులు కారుని హెలికాప్టర్‌లా మార్పుల చేసి చక్కగా రంగులు వేసేందుకు తీసుకువెళ్తుండగా ఊహించని విధంగా పోలీసుల వారిని అడ్డుకుని వాహనాన్ని చీజ్‌ చేశారు. అయితే ఈ అన్నదమ్ములు కారుని హెలికాప్టర్‌గా మార్చారు గానీ అందుకు అనుమతలు తప్పనసరి. ఇది తెలియకపోవడంతోనే ఈ బ్రదర్స్‌ అధికారులతో సమస్యను ఎదుర్కొన్నారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రవాణా నిబంధనలను పాటించనందుకు, సంబంధిత అధికారుల నుండి సరైన అనుమతి లేకుండా ఇలా మార్పులు చేసినందుకు సీజ్‌ చేశామని చెప్పారు.

ఈ మేరకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాల్ పాండే మాట్లాడుతూ, "మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు కారణంగా, పోలీసులు నిరంతరం వాహన తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. అలాంటి ఒక తనిఖీ సమయంలో, ట్రాఫిక్ పోలీసులు ఈ కారును పట్టుకున్నట్లు తెలిపారు. మార్పులకు అనుమతి అవసరం కాబట్టి ఆర్టీవో విభాగం, వాహనాన్ని మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 207 కింద సీజ్ చేసినట్లు వెల్లడించారు." పాండే. అయితే ఈ అన్నదమ్ములు చివరికీ జరిమాన చెల్లించి ఏదోలా వాహనాన్ని విడిపించుకున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.   

(చదవండి: పార్కింగ్‌ స్థలంలో 1800 ఏళ్ల నాటి పురాతన విగ్రహం!)

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)