Breaking News

అక్కా తమ్ముడు-అన్నా చెల్లెళ్లకు ఆ ఆలయంలోకి నో ఎంట్రీ!

Published on Sun, 03/17/2024 - 17:37

సాధారణంగా ఏ గుడికైన కుటుంబ సమేతం వెళ్లి దర్శించుకుంటాం. కానీ ఓ గుడికి మాత్రం అక్కా-తమ్ముడు, అన్నా-చెల్లెళ్ల కలిసి వెల్లకూడదట. అలాంటి వింత ఆలయం భారత్‌లో ఒకటి ఉంది. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది? ఎందుకని ఈ నిషేధం విధించారంటే..

ఆ ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ గ్రామంలో ఉంది. అది సాక్షాత్తు భోళా శంకరుడు ఆలయం. ఈ శివాలయాన్నిఏడు, ఎనిమిదో శతాబ్దకాలంలో కాలచూరి పాలకులు ఎరుపు, నలుపు రంగులతో కూడిన ఇసుకరాయితో నిర్మించారట. ఆలయ స్తంభాలపై అనేక అందమైన శిల్పాలు పర్యాటకులను అమితతంగా ఆకర్షిస్తాయి. ఈ దేవాలయంలోనే ఓ చిన్న మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం వివిధ రకాల విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. 

ఎందుకు ఈ నిషేధం అంటే..
ఈ ఆలయాన్ని కేవలం రాత్రుళ్లులోనే నిర్మించారట. అయితే ఆ గుడిని నిర్మించే శిల్పి నారాయణ్‌ నగ్నంగా ఈ ఆలయాన్ని నిర్మించేవాడట. రోజూ అతడి  భార్యే అతనికి భోజనం తీసుకొచ్చేదట. కానీ, ఓ రోజు నారాయణ్‌ చెల్లెలు భోజనం తీసుకుని ఆలయంలోకి వచ్చింది. నగ్నంగా ఉన్న అతడిని ప్రమాదవశాత్తు చూస్తుంది. దీన్ని నారాయణ్‌ చాలా అవమానంగా భావించి ఆ గుడిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి సోదర సోదరీమణులు ఈ ఆలయంలోకి రాకూడదని ఆ గ్రామ పెద్దలు నిషేధం విధించారు. అంటే అక్క తమ్ముడు, అన్నా- చెల్లికి మ్రాతమే నో ఎంట్రీ. అంటే అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లుకు ఇది వర్తించదు. ఏదీఏమైన కొన్ని దేవాలయాల నిర్మాణ శైలి, ఆచారాలు అత్యంత విచిత్రంగా ఉంటాయి. 

(చదవండి:  ప్రపంచంలోనే బెస్ట్‌ డెజెర్ట్‌గా భారతీయ స్వీట్‌! ఎన్నో స్థానంలో నిలిచిందంటే..)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)