Breaking News

వికీపీడియాలో మహిళా శాస్త్రవేత్తల బయోగ్రఫీ ఉందా? గమనించారా?

Published on Mon, 10/30/2023 - 15:26

ఈ డిజిటల్‌ ప్రపంచంలో దేని గురించి అయినా సమాచారం కావాంటే వెంటనే గూగుల్‌లో సర్చ్‌ చేస్తాం. ఔనా! వెంటనే ముందుగా వికీపీడియా ఆ తర్వాత మిగతా సైట్‌ల నుంచి దానికి సంబంధించిన సమాచారం కుప్పలు తెప్పలుగా వస్తాయి. కానీ వికీపీడియా ప్రతిదాని గురించి సమాచారం ఇచ్చింది గానీ మహిళా శాస్త్రవేత్తల ప్రొఫైల్స్‌ను చాలా తక్కువగానే అందించింది. ఆ లోటు భర్తి చేసేలా మహిళా శాస్రవేత్తలు బయోగ్రఫీని వికీపీడియాలో ఉంచి అందరికీ తెలిసిలే చేసింది. ఈ రంగంలో మహిళలు ఎక్కువమంది వచ్చేలా ఇన్ఫర్మేషన్‌ ఉంచింది ఓ మహిళా. ఇంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారా? అని అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఎవరామె? ఎలా ఆ ఇన్ఫర్మేషన్‌ని సేకరించింది?

బ్రిటన్‌కి చెందిన జెస్సికా వేడ్‌ తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌లో భౌతిక శాస్త్ర విభాగం మాస్టర్స్‌ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత అందులోనే పీహెచ్‌డీ పూర్తి చేసింది. అప్పుడే ఆమెకు మహిళలు పీహెచ్‌డీ దాక వచ్చే వాళ్లే అరుదని అర్థమైంది. ఆ తర్వాత ఆమె భౌతిక శాస్త్రవేత్తగా, టెలివిజన్‌లు, సోలార్ ప్యానెల్‌లు వంటి ఆప్టికల్ ఎలక్ట్రానిక్ పరికరాలను మరింత శక్తిమంతంగా పనిచేసేలా కార్బన్-ఆధారిత సెమీ-కండక్టర్‌లను అభివృద్ధి చేయడంపై పరిశోధనలు  చేస్తుంది. తన పరిశోధనలకు సంబంధించి 15 మంది విస్తృత బృందంలో ఓ ఐదుగురు వ్యక్తుల బృందానికి ఆమె నాయకత్వం వహిస్తుండగా అందులో తన తోపాటు మరొక మహిళా శాస్త్రవేత్త తప్పించి మిగతా అంతా పురుషులే.

అప్పుడే ఆమెకు అస్సలు మహిళా శాస్త్రవేత్తలు ఎందుకు ఉండటం​ లేదనే ప్రశ్న మెదిలింది. దీనికి తోడు వికీపీడియాలో కూడా మహిళా శాస్త్రవేత్తల గురించి ఆశించినంత స్థాయిలో ఇన్ఫర్మేషన్‌ అంతగా లేకపోవడం ఆమెను బాధించింది. అసలు దీనికి ప్రధాన కారణంగా తల్లిదండ్రలని ఆమెకు అనిపించింది. ఎందుకంటే ఏదో రకంగా డిగ్రీ సంపాదించి సెటిల్‌ అయితే చాలనుకుంటారు. పైగా వారే ఈ రంగంలోకి రానివ్వకుండా అడ్డకుంటున్నట్లు గమనించింది. 

ఆ జిజ‍్క్షాశ జెస్సికాను మహిళా శాస్త్రవేత్తల ఇన్ఫర్మేషన్‌ని వికీపీడియాలో ఉంచే ప్రాజెక్టును చేపట్టాలే చేసింది. ఇలా సుమారు వెయ్యికిపైగా మహిళా శాస్త్రవేత్తల ప్రొఫెల్స్‌ను అందించింది. ఇప్పటి వరకు ఆమె స్వయంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) తదితన నేపథ్యాలలో పనిచేస్తున్న అనేక మంది మహిళా శాస్త్రవేత్తలే కాకుండా ఉనికిలో లేని మహిళా శాస్త్రవేత్తలకు సంబంధించిన బయోగ్రఫీని కూడా ఉంచింది. సైన్సు వంటి రంగాల్లో మహిళలు లేరంటూ గగ్గోలు పెట్టడం కాదు ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గౌరవించి వారిని ఆన్‌లైన్‌లో కనపడేలా చేయాలి.

దీన్ని చూసైనా యువత ఈ రంగాల్లో రావడానికి ఆయా మహిళా శాస్త్రవేత్తలను ఆదర్శంగా ఎంచుకోవచ్చు లేదా అందుకు దోహదపడొచ్చు అనే లక్ష్యంతోనే ఇలా శోధించి మరీ రాస్తున్నాను అని చెప్పుకొచ్చింది జెస్సికా. ఒక్కో ప్రొఫైల్‌ అందించాలంటే కొన్ని గంటల సమయం పడుతున్నప్పటికీ పురుషాధిక్య ప్రపంచంలో మహిళలు కూడా సమానంగా ఉండాలనే ఎజెండాతోనే తాను ఇలా చేస్తున్నట్లు తెలిపింది. ఈ కృషికిగాను జెస్సికాను వికీపీడియా ఎన్నో అవార్డులు, పతకాలతో సత్కరించింది.

(చదవండి: కోవిడ్‌కి గురైతే గుండె సమస్య తప్పదా? ఆరోగ్య మంత్రి షాకింగ్‌ వ్యాఖ్యలు)

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)