Breaking News

టమాటా లేకపోతేనేం.. ఇలా వంటలు చేసుకోండి

Published on Mon, 07/10/2023 - 15:06

చాలామందికి టొమాటో కలపనిదే కూర చేయబుద్ధి కాదు. అయితే ఇటీవల కొద్దికాలం నుంచి సెంచరీ కొట్టినా .. కిందకి దిగనంటోంది టొమాటో. అయినా ఏం పర్వాలేదు, టొమాటో లేకపోయినా కూరలను రుచిగా వండొచ్చని చేసి చూపిస్తోంది ఈ వారం వంటిల్లు.... 

 బైగన్‌  కా బార్తా తయారీకి కావల్సినవి:
మీడియం సైజు వంకాయలు – రెండు
వెల్లుల్లి రెబ్బలు – నాలుగు
నూనె – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు
వెల్లుల్లి తరుగు – రెండు టీస్పూన్లు ; అల్లం – అంగుళం ముక్క (సన్నగా తురుముకోవాలి)
పచ్చిమిర్చి తరుగు – రెండు టీస్పూన్లు ; ఉల్లిపాయ తరుగు – అరకప్పు
కారం – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు, ధనియాల పొడి – టీస్పూను
ఉప్పు – రుచికి తగినంత; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు.

తయారీ  విధానమిలా..
♦ వంకాయలను శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి.
♦ ఇప్పుడు వంకాయలకు కొద్దిగా నూనె రాసి మూడు వైపులా మూడుగాట్లు పెట్టాలి. ఈ చీలిక మధ్యలో వెల్లుల్లి రెబ్బలను లోపలికి పోయేలా పెట్టాలి.
♦ ఇప్పుడు వంకాయను మంటమీద నేరుగా పెట్టి చక్కగా కాల్చుకోవాలి.
♦ వంకాయ కాలిన తరువాతచల్లారనిచ్చి, వెల్లుల్లి రెబ్బలను బయటకు తీసి సన్నగా తరగాలి. వంకాయను మెత్తగా చిదుముకోవాలి.
♦ బాణలిలో నూనెవేసి, కాగిన తరువాత వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసి రెండు నిమిషాలు వేయించాలి.
♦ ఇప్పుడు చిదుముకున్న వంకాయ గుజ్జు, ఉడికించి తరిగిన వెల్లుల్లిని వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి.
♦ కారం, ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పువేసి కలపాలి.
♦ నూనె పైకి తేలేంత వరకు మగ్గనిచ్చి కొత్తిమీర తరుగు చల్లుకుని దించేస్తే బైగాన్‌ బార్తా రెడీ. రోటీల్లోకి మంచి సైడ్‌ డిష్‌.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)