ఏమేమి తినచ్చు?

Published on Sun, 06/08/2025 - 01:23

నేను బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఇస్తున్నాను. ఇంట్లో చాలామంది రకరకాల ఆహారపదార్థాలు తినొద్దు, బిడ్డకు సమస్య అవుతుంది అని అంటున్నారు? ఏ విధమైన ఆహారం, మందులు పాలిచ్చే తల్లులకు సురక్షితమో చెప్పండి? – దేశీత, అమరావతి. 
బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఇస్తున్న తల్లులు ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పత్యం ఉండాల్సిన అవసరం లేదు. కాని, మరీ ఎక్కువ పరిమితిలో ఆహారం తీసుకోకూడదు. డైట్‌లో మాంసం, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, పండ్లు, గింజలూ ఉండాలి. సమతుల ఆహారం అవసరం. కొన్ని చేపల్లో ఎక్కువగా పాదరసం ఉంటుంది. వాటికి దూరంగా ఉండండి. ఆల్కహాల్‌ వద్దు. కెఫీన్‌ ఉన్న పానీయాలు తీసుకోవద్దు. 

టీ, కాఫీ, చాకొలేట్, సాఫ్ట్‌ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కోల్డ్‌ అండ్‌ ఫ్లూ మెడిసిన్స్ వాడకూడదు. ఎక్కువ కాఫీ తాగితే బేబీకి నిద్ర సమస్యలు వస్తాయి. మీకు టీ, కాఫీ అలవాట్లు ఉంటే డీకెఫీనేటెడ్‌ కాఫీ, టీ తాగొచ్చు. లెమన్‌ అండ్‌ హనీ వాటర్‌ తీసుకోవచ్చు. జలుబు, దగ్గు వస్తే యాంటీబయోటిక్స్‌ బదులు సింపుల్‌ కాఫ్‌ సిరప్‌ వాడాలి. 

మలబద్దకానికి హై ఫైబర్‌ డైట్‌ అవసరం. ఇందుకు లాక్టులోజ్‌ సిరప్‌ వాడొచ్చు. పైల్స్‌ ఉంటే ఆయింట్మెంట్స్‌ లేదా సపోజిటరీస్‌ వాడొచ్చు. తలనొప్పి, ఒళ్లునొప్పులు ఉంటే తగినంత విశ్రాంతి తీసుకోవాలి లేదా పారాసెటమాల్‌ టాబ్లెట్స్‌ వాడొచ్చు.

నాకు డెలివరీ అయి ఒకనెల అవుతుంది. నెల తర్వాత మళ్లీ చెకప్‌ కోసం రమ్మన్నారు. కాని, నేను మా ఊరిలో ఉన్నాను. ఈ సమయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు?  – జాగృతి, శ్రీకాకుళం. 
డెలివరీ తరువాత రెండు నెలలు లేదా ఆరు వారాల్లో గైనకాలజిస్ట్‌ని తప్పనిసరిగా కలవాలి. నార్మల్‌ డెలివరీ అయినా, సిజేరియన్‌ అయినా ఆరు వారాల్లో శరీరం కోలుకుంటుంది. బేబీకి ఆరు వారాల్లో వ్యాక్సినేషన్‌ కూడా ఇవ్వాలి. కుట్లు వేసిన చోట హీలింగ్‌ ఎలా ఉందో, బ్రెస్ట్‌ మిల్క్‌ ప్రొడక్షన్‌ ఎలా ఉందో, యూటిరస్‌ సైజు తగ్గిందో లేదో, వెజైనల్‌ హీలింగ్, యూరిన్, మోషన్‌ ప్రాబ్లెమ్స్‌ ఉన్నాయా, మల్టీ విటమిన్స్ అవసరమా, బీపీ, షుగర్‌ లేదా ప్రెగ్నెన్సీ నుంచి ఇస్తున్న మెడిసిన్స్ ఇంకా అవసరమా అనేది టెస్ట్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. 

అలాగే పాప్‌ స్మియర్‌ లేదా సర్వికల్‌ కేన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని డాక్టర్‌ చెప్తారు. ఈ టెస్ట్‌ ప్రతి మూడు ఏళ్లకు ఒకసారి చెయ్యాలి. హెచ్ పీవీ వ్యాక్సిన్‌ లేదా సర్విక్స్‌ కేన్సర్‌ ప్రివెన్షన్‌ వ్యాక్సిన్‌ ఈ టైమ్‌లో సజెస్ట్‌ చేస్తారు. వ్యాయామం చేయటం ఇప్పుడే మొదలుపెట్టాలి. పెల్విక్‌ ఫ్లోర్‌ వ్యాయామం అవసరమని చెప్తారు. అబ్డామినల్‌ బెల్ట్‌ను సజెస్ట్‌ చేస్తారు. బ్రెస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ లేదా నిపుల్‌ ఇన్‌ఫెక్షన్‌ను చెక్‌ చేస్తారు.

బ్రెస్ట్‌ ఇన్ఫెక్షన్‌ లేదా నిపుల్‌ డిశ్చార్జెస్‌ ఉంటే పరీక్షలు చేయించుకోవాలి. వ్యాక్సినేషన్‌ ప్రెగ్నెన్సీ తరువాత కూడా అవసరం ఉంటే ఇస్తారు. యూరిన్‌ లీక్, మోషన్‌ లీక్‌ ఉంటే రక్తం, మూత్ర పరీక్షలు చేయాలి. ఓవులేషన్‌ స్టార్ట్‌ అయిన తర్వాత కాంట్రాసెప్షన్‌ అవసరం ఉంటుంది. డిఫరెంట్‌ ఆప్షన్స్ గురించి డిస్కస్‌ చేయాలి. కాపర్‌–టి వంటి లాంగ్‌ టెర్మ్‌ కాంట్రాసెప్టివ్స్‌ ఇవ్వొచ్చు. బేబీ బర్త్‌ రిజిస్ట్రేషన్‌ కూడా చెక్‌ చేయాలి. ఆరు వారాల తరువాత డెలివరీ విజిట్‌ చాలా ముఖ్యం. కాబట్టి, తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్లి డాక్టరును సంప్రదించండి. 

-డా‘‘ భావన కాసు
-గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌ , హైదరాబాద్‌

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)