Breaking News

సున్నపు రాయి ఇంత ప్రమాదమా? అదే ఆ తల్లికి తీరని కడుపు కోత మిగిల్చింది!

Published on Wed, 08/09/2023 - 15:40

మన కళ్ల ముందు కనిపించేవి, మన నిత్య జీవితంలో ఉపయోగించేవి చెడు చేస్తాయని ఊహించం. నష్టం వాటిల్లంత వరకు.. తేరుకోం, తెలుసుకోం. సరదాగా తీసుకుంటాం. ఏం కాదనకుంటాం. జరగకూడనిది జరిగినప్పుడూ గానీ మనకు అవగతం కాదు. టైం బాలేనప్పుడూ తాడే పామై మృత్యువు అవుతుందని పెద్దలు అందుకే అన్నారేమో!. అచ్చం అలాంటి విషాదకర ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది.

భవన నిర్మాణ సామాగ్రికి సంబంధించిన సున్నపు రాయి పౌడర్‌ రోడ్డుకి ఒకపక్కన రాసిలా ఉంది. అక్కడే రొమాల్డో బిటెన్‌కోర్ట్ కుటుంబం నివశిస్తుంది.  వాళ్ల ఏడేళ్ల బాబు ఆడుకోవడం కోసం అని బయటకు వచ్చి ఈ సున్నపు రాయి పౌడర్‌ వద్దకు వచ్చాడు. దాంట్లో దొర్లి ఆడుకుంటూ కేరింతలు కొట్టాడు. అతడి కుటుంబ సభ్యులు ఫోటోలు కూడా తీశారు. సరదాపడుతున్నాడు కదా అని ఏమి అనలేదు. అంతే సడెన్‌గా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా కుటుంబసభ్యలుకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.

వెంటనే ఆ బాలుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆ పౌడర్‌ శ్వాసనాళల్లోకి చేరిందని అందువల్లే అతడు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఒక్కసారిగా ఆ కుటుంబం శోక సంద్రంలోకి వెళ్లిపోయింది. మరొక చిన్నారి ఇలా మృత్యువాత పడకూడదనే సదుద్దేశంతో ఆ బాలుడి కుటుంబసభ్యులు ఆ సున్నపు రాయి వద్ద ఆడుకున్న చివరి ఫోటోలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని వివరించారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాటి దగ్గరకి పిల్లల్ని వెల్లనీయకుండా చూసుకోండి అని సూచించారు. 

సున్నపు రాయి ప్రమాదకరమా..పీల్చితే అంతేనా!
అయితే ఈ సున్నపు రాయి రేణువు సాధారణ ఇసుక రేణువు కంటే వంద రెట్లు చిన్నదని ఈజీగా శ్వాసక్రియా నాళాల్లోకి వెళ్లిపోతుందని చెప్పారు వైద్యులు. అయితే దీన్ని పిల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌, క్రానిక్ అబస్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్, కిడ్నీ వ్యాధి, సిలికోసిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే సున్నపు రాయి రేణువులు ఊపిరితిత్తుల కణజాలంలో  చిక్కుకోవడం వల్ల శరీరంపై వాపు, మచ్చలు ఏర్పడతాయి. ఫలితంగా ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ని తీసుకునే సామర్థ్యం తగ్గిపోయి ఊపిరితిత్తుల వ్యాధికి దారితీసి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది.  

(చదవండి: ఇష్టం అంటే మరీ ఇలానా! ఈ 'స్ట్రేంజ్‌ అడిక్షన్‌' వింటే షాకవ్వాల్సిందే!)

Videos

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)