Breaking News

ఇచట కలలు అమ్మబడును!

Published on Thu, 02/19/2026 - 05:41

‘నాకొక కల వచ్చింది తెలుసా!’ అని చెబితే... ‘బ్రహ్మాండంగా ఉంది. ప్లీజ్‌...ఆ కలను నాకు అమ్ముతావా’ అని అవతలి వ్యక్తి అడిగితే నవ్వుకుంటాం. ఇప్పుడు నవ్వులాటగా అనిపించినా ఒకప్పుడు ఇలాంటి సంభాషణలు సహజంగా జరిగేవి. వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ కొరియాలో కలల క్రయ, విక్రయాలు జోరుగా సాగేవి. అలనాటి అరుదైన సంప్రదాయానికి తిరిగి ప్రాణం పోస్తోంది కొరియన్‌ ఆర్టిస్ట్‌ లొంగ్సు పార్క్‌...

ఆరవ శతాబ్దంలో కొరియాలో కలల అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా సాగేవి! కలలలో తమకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే శకునాలు ఉంటాయని ఒకప్పుడు కొరియాలో బలంగా నమ్మేవాళ్లు. కల గురించి విన్న వ్యక్తి ఆ కల తనకు ప్రయోజనకరంగా ఉంది అని భావిస్తే, తనకు విక్రయించాల్సిందిగా కలలు కన్న వ్యక్తిని అడగవచ్చు. అమ్మడానికి ఆ వ్యక్తి ఓకే అంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. లేదా విలువైన వస్తువు ఏదైనా ఇవ్వవచ్చు.

ఎస్‌... ఆధారాలు ఉన్నాయి!
‘అకాడమీ ఆఫ్‌ కొరియన్‌ స్టడీస్‌ ఆర్కైవ్స్‌’లో కలల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకు 1900 సంవత్సరంలో తనకు వచ్చిన కలలో డ్రాగన్, పులి కనిపించిన ఒక వ్యక్తి తన కలను అమ్ముకున్నాడు.

అత్యవసరంగా డబ్బు అవసరం ఉండడం వల్లే తన కలను విక్రయించినట్లు ఒప్పంద పత్రంలో ఉంది. కొన్నిసార్లు కలలు అమ్మడానికి ఆ కలల యజమానులు అంగీకరించకపోవచ్చు. తమ కలలు రహస్యంగానే ఉండిపోవాలని అనుకోవచ్చు. తమ కలలను ఇతరులతో పంచుకుంటే వాటి శక్తి తగ్గిపోతుందనుకోవడమే దీనికి కారణం.

గతం నుంచి వర్తమానంలోకి...
పన్నెండవ శతాబ్దానికి చెందిన కొరియన్‌ అధికారిక చరిత్ర ‘ది హిస్టరీ ఆఫ్‌ త్రీ కింగ్‌డమ్స్‌’లో కలల అమ్మకాలకు సంబంధించిన పురాతన కథలు ఉన్నాయి. అలనాటి ఆ పాత సంప్రదాయాన్ని వర్తమానంలోకి తీసుకువచ్చింది లండన్‌కు చెందిన కొరియన్‌ ఆర్టిస్ట్‌ లొంగ్సు పార్క్‌.

అలా మొదలైంది...
కొన్ని సంవత్సరాల క్రితం లండన్‌లోని ఒక కేఫ్‌లో తన స్నేహితురాలిని కలిసినప్పుడు మాటల మధ్యలో రాత్రి తనకు కలలో టొమాటో సైజ్‌ బ్లూ బెర్రీ కనిపించిందని చెప్పింది పార్క్‌.

‘ఎంత మంచి కల! నాకు అమ్మేసెయ్‌’ అని ప్రతిపాదించింది ఆ స్నేహితురాలు. పార్క్‌ స్నేహితురాలు గర్భవతి. గర్బంతో ఉన్న వారికి బ్లూ బెర్రీ కలలో కనిపిస్తే... పండంటి బిడ్డ పుడతాడని కొరియాలో నమ్మకం!

తన కలను అమ్మేసింది పార్క్‌.  హోటల్‌ బిల్‌ను పార్క్‌ స్నేహితురాలే  చెల్లించడంతో డీల్‌ పూర్తయింది! ‘ఇష్ట పూర్వకంగా ఉంటేనే కలల లావాదేవీలు పనిచేస్తాయి’ అని చెబుతోంది పార్క్‌. కొన్ని నెలల తరువాత... పండంటి బిడ్డను కన్నట్లు స్నేహితురాలి నుంచి మెసేజ్‌ వచ్చింది.
దీంతో కొరియన్‌ సంప్రదాయాలలోని కలల గురించి పార్క్‌కు ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తే కలల వెబ్‌సైట్‌కు శ్రీకారం చుట్టడానికి కారణం అయింది.    
 
డ్రీమ్‌ అడ్వర్‌టైజింగ్‌
మెలకువతో ఉన్నప్పుడే కాదు నిద్రలో ఉన్నప్పుడు కూడా కస్టమర్‌లకు చేరువకావడానికి రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు  చేస్తున్నాయి కొన్ని పెద్ద కంపెనీలు. ‘వద్దు బాబోయ్‌’ అనుకున్నా ఆ కంపెనీల అడ్వర్‌టైజ్‌మెంట్‌లు కలలలోకి వస్తాయన్న మాట!  తరుచుగా వినిపించే, కనిపించే ఆడియో, వీడియో క్లిప్‌ల ద్వారా వినియోగదారుల సబ్‌కాన్షియస్‌లోకి వెళుతున్నాయి బడాకంపెనీల ప్రకటనలు. ఈ కాన్సెప్ట్‌ను ‘డ్రీమ్‌ అడ్వర్‌టైజింగ్‌’ అంటున్నారు.

 ‘డ్రీమ్‌ అడ్వర్‌టైజ్‌మెంట్స్‌ రాబోయే కాలంలో పీడకలగా మారనున్నాయి’ అని హెచ్చరిస్తున్నారు  స్లీప్‌ ఎక్స్‌పర్ట్‌లు. అమెరికన్‌ యువతలో 48 శాతం మందికి ప్రసిద్ధ బ్రాండ్‌లకు సంబంధించిన అడ్వర్‌టైజింగ్‌ కలలు తరచుగా వస్తున్నట్లు  ఒక నివేదిక తెలియజేసింది. కోకా–కోలా, యాపిల్, మెక్‌డోనాల్డ్‌లాంటి ప్రసిద్ధ బ్రాండ్‌లకు సంబంధించిన కలలు వస్తుంటాయట. యాదృచ్ఛికంగా ఈ బ్రాండ్‌లకు సంబంధించిన యాడ్స్‌  పదే పదే చూడాల్సి రావడం, మెమోరీ రీయాక్టివేషన్‌ వల్లే ఇలాంటి కలలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు.

కలలు వేలం వేస్తారు!
కలల వేలానికి సంబంధించి లొంగ్సు పార్క్‌ ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. తమకు వచ్చిన కలల గురించి ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఇతరులతో పంచుకోవచ్చునని తెలియజేసింది. ‘మేము కొనుగోలు చేసిన కల నిజమా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి. దానికి ఆధారం ఏమిటి’ ఈ ప్రశ్నను చాలామంది పార్క్‌ను అడుగుతుంటారు. ‘ఆరోజు నుంచి ఈరోజు వరకు కలలను నిరూపించుకునే ఆధారలేవీ లేవు. అది అసాధ్యం కూడా. ఒకరిపై ఒకరికి విశ్వాసమే ప్రధానం. 

నిజాయితీ మాత్రమే ప్రధానం’ అని చెబుతుంది పార్క్‌. వెబ్‌సైట్‌లో కొన్ని కీలక పదాలు నమోదు చేస్తారు. ఉదాహరణకు ‘పాము’ అనే కీవర్డ్‌ కనిపించింది అనుకుందాం. అది పాము కలకు సంబంధించిన వ్యక్తి గురించి సమాచారాన్ని అందిస్తుంది. పాములు కలలో కనిపిస్తే కొరియన్‌ సంప్రదాయం ప్రకారం జీవితంలో, కెరీర్‌లో విజయం సాధించబోతున్నారని అర్థం. మంటల్లో ఇల్లు ఉన్నట్లు కల వస్తే కష్టాలు కాలిపోతున్నాయని అర్థం. చెడు శకునాలకు సంబంధించిన కలలు కూడా ఉన్నాయి. పండ్లు ఊడిపోయినట్లు కల వస్తే సన్నిహిత వ్యక్తిని కోల్పోతున్నారని అర్థం.

ఆ కలే... అవతార్‌!
‘కలలదేముంది? ఇలా వస్తాయి... అలా పోతాయి’ అని రాత్రి కలలను తేలికగా తీసుకోవడానికి లేదు. ఎన్నో కలలు ఎన్నో ఆవిష్కరణలకు కారణం అయ్యాయి. అద్భుతమైన ఆలోచనలు ఎన్నో తనకు కలల రూపంలోనే వచ్చాయని చె΄్పారు ప్రసిద్ధ శాస్త్రవేత్త నికోలా టెస్లా. తన ఆత్మకథ ‘మై ఇన్వెన్షన్స్‌’లో కలల ప్రస్తావన ఉంటుంది. చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన ‘అవతార్‌’ గురించి పరిచయం అక్కర్లేదు. 

‘అవతార్‌’ ఐడియా జేమ్స్‌ కామెరూన్‌కు ఎలా వచ్చింది అనేది ఆసక్తికర విషయం. కామెరూన్‌ యువకుడిగా ఉన్నప్పుడు రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో అతడికి మరో లోకం కనిపించింది. బంగారంలా మెరుస్తున్న చెట్లు, అందమైన జీవులతో ఉన్న అద్భుత లోకం ఇది. ఆ కల కామెరూన్‌తో ఉండి చివరికి అవతార్‌లో పండోర ప్రపంచంగా రూపం దాల్చింది. ‘పందొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను కన్న కల అది’ అని ‘అవతార్‌’ గురించి చెబుతుంటారు కామెరూన్‌.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)