Breaking News

బోన్ మ్యారో క్యాన్సర్..నియంత్రణ ఇలా...!

Published on Wed, 05/22/2024 - 16:16

క్రానిక్‌ మైలోయిడ్‌ లుకేమియా... (సిఎమ్ ఎల్) ఎముక మజ్జ లేదా బోన్ మ్యారోకి సోకే ఓ అరుదైన క్యాన్సర్.. (సిఎమ్‌ఎల్‌). ఇది మొత్తం లుకేమియా కేసుల్లో 15% దాకా ఉండే సీఎంఎల్‌ బోన్‌మ్యారోను ప్రభావితం చేస్తుంది, ఇది తెల్ల రక్త కణాల నియంత్రణలేని పెరుగుదలకు దారితీస్తుంది. క్యాన్సర్‌ నిర్ధారణ కాగానే మొదట్లో భయంకరంగా అనిపించినప్పటికీ, సీఎంఎల్‌ను సరైన విధానంతో నియంత్రించవచ్చునని  గుర్తించడం చాలా ముఖ్యం అంటున్నారు హైదరాబాద్‌లోని నిమ్స్‌ మెడికల్‌ ఆంకాలజీ విభాగం హెడ్, ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి సదాశివుడు. 

ఆయన చెబుతున్న విశేషాలివి...
సీఎంఎల్‌ నిర్ధారణ అయినప్పటికీ రోగులు సంతృప్తికరమైన జీవితాలను గడపవచ్చు. అయితే, సీఎంఎల్‌ నిర్వహణలో సరైన విధానాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే చికిత్స చేయని దీర్ఘకాలిక–దశ సీఎంఎల్‌ వేగంగా వృద్ధి చెందుతుంది. సమర్థవంతమైన చికిత్సకి, వ్యాధి పెరుగుదలని నివారించడానికి బిసిఆర్‌–ఎబిఎల్‌ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం, చికిత్స లక్ష్యాలకు కట్టుబడి ఉండటం అవసరం. అదనంగా మీ వైద్యునితో తాజా చికిత్సల గురించి చర్చించడం వలన మీరు చికిత్స ప్రక్రియను అర్థం చేసుకోవడానికి, మెరుగైన జీవన నాణ్యతకు సహాయపడుతుంది.

కొన్ని సందర్భాల్లో  సీఎంఎల్‌ ని  ’మంచి క్యాన్సర్‌’ అని పిలిచినప్పటికీ, సీఎంఎల్‌ పురోగమిస్తున్న కొద్దీ అది ’మంచిది’ గా ఉండడం మానేస్తుంది అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. కొంత మంది రోగులు వారి దైనందిన జీవితాలను ప్రభావితం చేసే మందులకు నిరోధకంగా ఉండవచ్చు లేదా దుష్ప్రభావాలను అనుభవించవచ్చు. అయితే, సకాలంలో జోక్యం, జాగ్రత్తగా పర్యవేక్షించడం ఈ సవాళ్లను నివారించడంలో సహాయపడతాయి.

వైద్యపరమైన అంశాలతో పాటు, సీఎంఎల్‌ కలిగించే భావోద్వేగ ప్రభావాన్ని విస్మరించలేం. సీఎంఎల్‌ రోగులు ఎదుర్కొనే ప్రారంభ సవాళ్లలో క్యాన్సర్‌తో సంబంధం ఉన్న సామాజిక కళంకం ఒకటి. సామాజిక అంశాల కారణంగా చాలా మంది వ్యక్తులు తమ రోగనిర్ధారణను దగ్గరి కుటుంబసభ్యులకు మించి బయటి వారికి వెల్లడించడానికి సంకోచిస్తారు. అయితే ఓపెన్‌ కమ్యూనికేషన్‌  అవసరమైనప్పుడు మానసిక ఆరోగ్య సహాయాన్ని కోరడం అనేది సంపూర్ణ సీఎంఎల్‌ నిర్వహణలో ముఖ్యమైనవి.

సీఎంఎల్‌ రోగుల కోసం కొన్ని సూచనలు...

  • నిరంతర పర్యవేక్షణ: చికిత్స ప్రభావాన్ని అంచనా వేయడానికి, ఏవైనా మార్పులను ముందుగానే తెలుసుకునేందుకు బిసిఆర్‌–ఎబిఎల్‌  స్థాయిలను ఎప్పటికప్పుడు గుర్తించాలి. సకాలంలో జోక్యం చేసుకోవ డానికి, వ్యాధి పురోగతిని నివారించడానికి రెగ్యులర్‌ పర్యవేక్షణ చాలా ముఖ్యమైనది.

  • దినచర్యలో మానసిక ఆరోగ్య మద్దతు, ఆహారపు సర్దుబాట్లు  క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం  సీఎంఎల్‌ నియంత్రణకు వీలు కల్పిస్తుంది.

  • ఆరోగ్య సంరక్షకులు, వైద్యులతో మనసు విప్పి, నిజాయితీగా సంభాషించడం అవసరం.  సీఎంఎల్‌ తో ప్రయాణంలో ఎదుర్కొనే ఏవైనా ఆందోళనలు, లక్షణాలు లేదా సవాళ్లను పంచుకోవాలి.

  • సపోర్ట్‌ నెట్‌వర్క్‌లు: అనుభవాలను పంచుకోవడానికి, భావోద్వేగ మద్దతును పొందడానికిÜపోర్ట్‌ గ్రూప్‌ల ద్వారా ఇతర సీఎంఎల్‌ రోగులతో సంబంధాలు ఏర్పరచుకోండి.

  • నేషనల్‌ ఇన్సిటిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.2 నుంచి 1.5 మిలియన్ల మంది సీఎంఎల్‌ తో జీవిస్తున్నారు. వైద్య శాస్త్రంలో పురోగతి కారణంగా చికిత్స ఫలితాలలో గణనీయమైన మెరుగుదల సాధ్యమవుతోంది. సీఎంఎల్‌ చికిత్సలో భాగమైన టైరోసిన్‌ కినేస్‌ ఇన్హిబిటర్స్‌ , రోగులకు ఫలితాలు  జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరిచాయి.

కౌన్సిలింగ్‌ చాలా ముఖ్యం...
‘నేను బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న 9 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల అన్ని వయసుల రోగులను చూశా. దీర్ఘకాలిక మైలోయిడ్‌ లుకేమియా నిర్ధారణ  తర్వాత, చాలా మంది రోగులు తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతారు. అందువల్ల, వారికి సరైన కౌన్సెలింగ్‌ అందించడం చాలా ముఖ్యం


ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి సదాశివుడు, నిమ్స్‌ మెడికల్‌ ఆంకాలజీ విభాగం

(చదవండి: 'టీ'ని అతిగా మరిగిస్తున్నారా? ఎంత వ్యవధిలో చేయాలంటే..)
 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)