Breaking News

బాడీ స్క్రబ్‌ : మీ శరీరానికి ఏది మంచిదో గుర్తించండి!

Published on Wed, 08/28/2024 - 17:19

 వాతావరణ పరిస్థితులు ,మారుతున్న జీవనశైలి కారణంగా  శరీరం, ముఖ్యంగా ముఖం ట్యాన్‌కు గురవుతుంది.  యూవీ కిరణాల ప్రభావంతో పాటు, ఫ్రీ రాడికల్స్ , కాలుష్యం కూడా దీనికి కారణం.  కాబట్టి, ముఖంతో పాటు  శరీరానికి కూడా  సమానమైన శ్రద్ధ ,రక్షణ అవసరం. దీనికి క్రమం తప్పకుండా కొన్ని  జాగ్రత్తలు అవసరం. కేవలం సబ్బు బార్ లేదా షవర్ జెల్ లాంటివాటికి  మాత్రమే పరిమితం కాకుండా, సహజమైన ,యవ్వన రూపాన్ని తిరిగి పొందడానికి,  శరీరానికి తగ్గట్టు  బాడీ పాలిష్, బాడీ స్క్రబ్, ఎక్స్‌ఫోలియేషన్‌ లాంటి వాటిని  ఎంచుకోవాలి.

బాడీ పాలిషర్ లేదా బాడీ ఎక్స్‌ఫోలియేట్  ద్వారా రక్త ప్రసరణపెరుగుతుంది. బాడీ స్క్రబ్ డెడ్‌ స్కిన్‌ కణాలను తొలగిస్తుంది, చర్మాన్ని శుభ్రపర్చి మెరిసేలా చేస్తుంది. కొల్లాజెన్‌ను ప్రేరేపిస్తుంది, వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.

 ఎలా చేసుకోవాలి?
అయితే చర్మం మీద మృతకణాలను తొలగించి చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స్క్రబ్‌ను ప్రతిసారీ మార్కెట్‌లో కొనాల్సిన పనిలేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు. టేబుల్‌ స్పూన్‌ ఓట్స్, టేబుల్‌ స్పూన్‌ తేనె, టేబుల్‌ స్పూన్‌ పాలు, అర కప్పు నీరు తీసుకోవాలి. ఓట్స్‌ను నీటిలో ఉడికించాలి. వేడి తగ్గిన తర్వాత మిగిలిన అన్నింటినీ వేసి కలిపితే స్క్రబ్‌ రెడీ. ఈ  ప్యాక్‌ వేసుకునే ముందు సబ్బుతో ముఖం, చేతులను కడిగి తుడుచుకోవాలి.  ప్యాక్‌ను సమంగా పట్టించి పది లేదా పదిహేను నిమిషాల  నాటు అలాగే ఉంచాలి. చర్మానికి పట్టినట్లు బిగుసుకుంటుంది. అప్పుడు వేళ్లతో వలయాకారంగా మర్దన చేయాలి. అలా పది నిమిషాల సేపు మర్దన చేసిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి  మార్కెట్‌లో దొరికే స్క్రబ్‌లాగ ఫ్రూట్‌ ఫ్లేవర్‌లతో కావాలనుకుంటే ఇష్టమైన పండ్ల గుజ్జును కూడా కలుపుకోవచ్చు. 

ఎలాంటి స్కిన్‌కు ఎలాంటి స్క్రబ్‌ వాడాలి?
పొడిచర్మం వాళ్లు పుల్లటి పండ్ల జోలికి వెళ్లవకూడదు. పొడి (లేదా ఫ్లాకీ) చర్మానికి  గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న  ప్రొడక్ట్స్‌ను  ఎంపిక చేసుకోవాలి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు తప్పనిసరిగా రెగ్యులర్ స్క్రబ్బింగ్ స్కిన్‌కేర్ రొటీన్‌కు దూరంగా ఉండాలి. వారానికి ఒకసారి, తేలికపాటి కెమికల్ ఎక్స్‌ఫోలియేటర్‌ను ప్రయత్నించవచ్చు. మెత్తగా, లాక్టిక్ యాసిడ్‌తో ఉండేలా చూసుకోవాలి.
జిడ్డు చర్మం ఉన్నవారికి బాడీ స్క్రబ్ వలన ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది. లినోలెయిక్ యాసిడ్, బాంబూచార్‌కోల్‌ బెటర్‌. ఇవి కఠినమైన మచ్చల్న తొలగించి, మృదువైన వెల్వెట్ ఫీలింగ్‌ నిస్తాయి. ఇక సమస్య లేని, సాధారణమైన  చర్మం  ఉన్నవారికి pH బ్యాలెన్స్‌డ్ క్లెన్సర్ , స్క్రబ్‌ని ఉత్తమం.
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)