Breaking News

బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు

Published on Mon, 07/14/2025 - 11:26

విజయనగరం అర్బన్‌ బొబ్బిలి: ఇప్పటికే దేశ విదేశాల్లో విశేష ప్రాచుర్యం పొందిన బొబ్బిలి వీణ (Bobbili Veena) కు మరో అరుదైన గుర్తింపు లభించింది. వన్‌ డి్రస్టిక్ట్‌.. వన్‌ ప్రొడక్ట్‌  (ఓడీఓపీ) కింద బొబ్బిలి వీణ బహుమతికి ఎంపికైంది. ఓడీఓపీ అవార్డుకు రాష్ట్రం నుంచి 7 జిల్లాలకు చెందిన ఉత్పత్తులు ఎంపిక కాగా మన బొబ్బిలికి చెందిన నమూ నా వీణ ఎంపిక కావడం జిల్లాకు గర్వ కారణంగా నిలిచింది. ఈ పురస్కారాన్ని అందుకునేందుకు కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఢిల్లీ వెళ్లారు. కొత్త ఢిల్లీ ప్రగతి మైదానంలో భారత్‌ మండపంలో సోమ వారం జరిగే కార్యక్రమంలో ఓడీఓపీ అవార్డును కలెక్టర్‌ అందుకోనున్నారు.  

బొబ్బిలి వీణకు అంతర్జాతీయ గుర్తింపు   
బొబ్బిలి వీణకు దేశ విదేశాల్లో ఎనలేని ఖ్యాతి ఉంది. బొబ్బిలి వీణ అని విస్తృతంగా పిలువబడే బొబ్బి లి నుంచి వచ్చిన సాంప్రదాయ ’సరస్వతి వీణ’ విలక్షణమైన స్వరాలకు ప్రసిద్ధి చెందింది.  అలాగే సరస్వతి వీణను పోలి ఉండే చిన్నపాటి వీణను బహుమతిగా జ్ఞాపికగా ఇవ్వడం ఏళ్ల తరబడి సంప్రదాయంగా వస్తోంది. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ సమావేశాలు, సదస్సులో సైతం బొబ్బిలి నమూనా వీణలను జ్ఞాపికలుగా ఇవ్వడం జరుగుతోంది. బొబ్బిలి వీణ బొమ్మలతో పోస్టల్‌ స్టాంపులు, నాణేలు కూడా ముద్రితమయ్యాయి. ఇతర రాష్ట్రాలకు సైతం బొబ్బిలి వీణలు ఎగుమతి అవుతున్నాయి. ఢిల్లీలో జరిగిన జీ–20 సదస్సులో, విశాఖలో జరిగిన గ్లోబల్‌ సమ్మిట్‌లో సైతం బొబ్బిలి వీణ ప్రదర్శనలు జరిగాయి. అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌ ఈ వీణను చూసి ముచ్చటపడ్డారు. బొబ్బిలి వీణకు ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం నుంచి భౌగోళిక గుర్తింపు కూడా లభించింది.  బొబ్బిలి పట్టణానికి సమీపంలోని గొల్లపల్లి, బాడంగి మండలం వాడాడ వీణల తయారీకి ప్రసిద్ధి చెందిన గ్రామాలు. వీణల తయారీ ఒక అరుదైన హస్త కళగా గుర్తింపు పొందింది. ఈ గ్రామాల్లో దాదాపు 300 కుటుంబాలు తమ జీవనోపాధి కోసం వీణల తయారీలో నిమగ్నమై ఉన్నారు. వీటి తయారీకి పనస మరియు సంపంగి కలప, చెక్కకు ఉపయోగిస్తారు. వీణల తయారీకి కలప కొరతను నివారించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తృతంగా పనస చెట్లను పెంచాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. ఓడీఓపీ కింద బొబ్బిలి వీణకు గుర్తింపు లభించడంతో వీటి ఖ్యాతి మరింత ఇనుమడిస్తుందనడంలో సందేహం లేదు.    

Videos

కొండేపిలో నూతన YSRCP ఆఫీస్ ప్రారంభం

అనకాపల్లి జిల్లాలో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న వెంగమాంబ క్రషర్ స్టోన్

మూడు గంటలకు పైగా ఎంపీ P.V మిథున్ రెడ్డిని - విచారిస్తున్న సిట్

Nallakunta: ప్రతి సంవత్సరం వర్షం వస్తే ఇదే పరిస్థితి అంటూ కాలనీవాసుల ఆవేదన

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి

ఐర్లాండ్ లో బయటపడిన భయానక రహస్యం

కుండబద్దలుకొట్టిన DGలు

అమెరికా రాజకీయాలను కుదిపేస్తున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కేసు

దమ్ముంటే ఆధారాలు చూపించండి.. లిక్కర్ కేసుపై శైలజానాథ్ రియాక్షన్

Visakhapatnam: ఐటీసీ గోడౌన్ లో చెలరేగిన మంటలు

Photos

+5

లండన్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న నీరజ్ చోప్రా.. (ఫొటోలు)

+5

డస్కీ బ్యూటీ బ్రిగిడ.. చుడీదార్‌లో ఇలా (ఫొటోలు)

+5

యూట్యూబ్‌లో ట్రెండింగ్.. రష్మిక 'నదివే' సాంగ్ HD స్టిల్స్ (ఫొటోలు)

+5

కొంపల్లిలో సందడి చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌ జాతికి అంకితం (ఫొటోలు)

+5

ట్రైలర్ లాంచ్ ఈవెంటో మెరిసిన నటి డింపుల్ హయాతీ (ఫొటోలు)

+5

విజయవాడ : సారె తెచ్చి..మనసారా కొలిచి..కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

జడివానకు హైదరాబాద్‌ అతలాకుతలం.. ట్రాఫిక్‌ జామ్‌తో చుక్కలు చూసిన వాహనదారులు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..చెరువుల్లా మారిన రోడ్లు (ఫొటోలు)

+5

‘నా సీతా సీమంతం’ శ్రీమతి సీమంతంపై బిగ్‌బాస్‌ ఫేం పోస్ట్‌ (ఫొటోలు)