Breaking News

వేడివేడి అన్నంలో కాకరకాయ పచ్చడితో ఇలా టేస్టీగా..

Published on Mon, 06/26/2023 - 13:23

కాకరకాయ పచ్చడి తయారీకి కావల్సినవి:
కాకరకాయలు – పెద్దవి రెండు; పచ్చిమిర్చి – పన్నెండు
 చిన్న ఉల్లిపాయలు – పదిహేను; అల్లం – అంగుళం ముక్క
 పచ్చికొబ్బరి తురుము – అరకప్పు ; గడ్డపెరుగు – రెండు కప్పులు
 ఆవాలు – అరటీస్పూను, మెంతులు – పావు టీస్పూను
 ఎండు మిర్చి – రెండు ; కరివేపాకు – ఐదు రెమ్మలు
నూనె – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు, కారం – చిటికెడు.

తయారీ విధానం ఇలా..
కాకరకాయలను నీటిలో నానబెట్టి శుభ్రంగా కడిగి విత్తనాలు తీసేయాలి. ఇప్పుడు కాకరకాయలను చిన్నచిన్న ముక్కలుగా తరుక్కోవాలి. అల్లం తొక్కతీసి సన్నగా తరగాలి. 10 పచ్చిమిర్చి, 12 ఉల్లిపాయలను కూడా సన్నని ముక్కలుగా కట్‌ చేయాలి. కాకరకాయ, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను ఒక గిన్నెలో వేయాలి. దీనిలో కరివేపాకు, కొద్దిగా ఉప్పు, టీస్పూను నూనెవేసి చక్కగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమం మొత్తాన్ని బాణలిలో వేసి రెండు నిమిషాలు పెద్దమంట మీద వేయించాలి. తరువాత మూతపెట్టి సన్న మంట మీద పది నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్యలో కలుపుతూ అడుగంటితే మరో టీస్పూను నూనె వేయాలి. కొబ్బరి తురుముకు మూడు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిరపకాయలు, రెండు టేబుల్‌ స్పూన్ల నీళ్లు జోడించి పేస్టు చేయాలి.

బాణలిలో మగ్గుతున్న మిశ్రమంలో ఈ పేస్టు వేసి, కలిపి ఐదు నిమిషాల తరువాత దించేయాలి. పెరుగుని సమంగా కలుపుకుని మగ్గిన మిశ్రమంలో వేయాలి. రుచికి సరిపడా ఉప్పు కలిపి తిప్పాలి. ∙మిగిలిన నూనెతో ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి. కరివేకుతో తాలింపు వేసి కలుపుకోవాలి. చివరిగా కారం చల్లుకుని సర్వ్‌చేసుకోవాలి. 

Videos

YSRCP పేరుతో దొంగ నామినేషన్లు వేసిన 16 మంది TDP నేతలు వీళ్లే..!

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

టీడీపీ నేతలకు తొడగొట్టి సవాల్ విసిరిన మహిళ.. ఇది వింటే..!

టెక్ మహీంద్రా షేర్లలో దూకుడు... 100 షేర్లకు మరో 100 ఫ్రీ

జనసేన అభ్యర్థిని చితక్కొట్టిన TDP గూండాలు

కుప్పంలో YSRCP పేరుతో TDP దొంగ నామినేషన్లు.. అడ్డంగా దొరికిపోయిన బాబు

మా పై దాడి చేస్తారా.. తేల్చుకుందాం! TDPకి జనసేన నేతలు STRONG వార్నింగ్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్