Breaking News

రూ. 400 చెప్పుల్ని లక్షకు అమ్ముకుంటారా? ప్రాడాపై హర్ష్‌ గోయెంకా విమర్శలు

Published on Fri, 06/27/2025 - 16:08

ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ ప్రాడా ఇటీవల ప్రదర్శించిన  చెప్పులు, వాటి ధరపై భారతీయ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా  స్పందించారు. అసలు కళాకారులకు క్రెడిట్ ఇవ్వకుండా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని  అంతర్జాతీయ బ్రాండ్లు లాభపడుతున్నాయంటూ  ఆయన విమర్శించారు.  ఇది చాలా విచారకరం అంటూ ట్వీట్‌ చేశారు.

 ప్రాడా పురుషుల పాదరక్షల స్ప్రింగ్ సమ్మర్ 2026  ఇటీవల  ప్రదర్శించింది.  వీటి డిజైన్‌ అచ్చం మన షోలాపూర్‌ చెప్పుల మాదిరిగానే రాజసాన్ని ఒలకబోస్తుట్టున్నాయి.  కానీ వాటి ధరే  1.2 లక్షలు  ఉండటం  హాట్ టాపిక్‌గా మారింది.  నెటిజన్లు దీనిపై తీవ్రంగా చర్చించారు.

అటు బిలియనీర్‌ గోయెంకా కూడా దీనిపై స్పందించారు.ఈ చెప్పుల ఫోటోలు ట్వీట్‌ చేస్తూ, ఇవి  భారతదేశపు ఐకానిక్ కొల్హాపురి చెప్పులను పోలి ఉన్నాయి, కానీ ధర లక్షకు పై మాటే!అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించారు.  మన  చేతివృత్తులు వారు వీటినే రూ.400 కు తయారు చేస్తారు. అంటే  వారు ఎంత నష్టపోతున్నారు? ప్రపంచ బ్రాండ్లు మన సంస్కృతిని   సొమ్ము చేసుకుంటున్నాయి. విచారకరం!  అంటూ  గోయెంకా  రాసుకొచ్చారు.

ఈ హై-ఎండ్‌ ఫ్యాషన్ చప్పల్స్‌ని ప్రీమియం మెటీరియల్స్, ఇండియన్ డిజైన్‌తో రూపొందించినట్టు  ప్రాడా ప్రకటించింది. అయితే ఇండియాలో  షోలాపూర్‌ చెప్పులను పోలి ఉన్న ఈ చెప్పుల ధర  భారీ లగ్జరీగా ఉండటంతో నెటిజన్లు  విస్తుపోయిన సంగతి తెలిసిందే.
 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)