Breaking News

మేకప్‌ బ్రష్‌లు శుభ్రం చేస్తున్నారా..?

Published on Sun, 01/12/2025 - 09:25

సాధారణంగా ముఖానికి మేకప్‌ వేసుకున్నాక, కొన్ని గంటల్లోనే దాన్ని క్లీన్స్‌  చేస్తుంటాం. చాలా శ్రద్ధగా చర్మం పాడవకుండా చూసుకుంటాం. మరి మేకప్‌ కోసం రోజూ వాడే బ్రష్‌ల సంగతేంటి? వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేస్తున్నారా? ఆ తర్వాత ఆరబెడుతున్నారా? బ్యాక్టీరియా చేరకుండా జాగ్రత్త పడుతున్నారా? లేదంటే యమ డేంజర్‌ అంటున్నారు నిపుణులు. 

కనీసం ప్రతి రెండు వారాలకు ఒకసారి మీ మేకప్‌ బ్రష్‌లను శుభ్రం చేసుకోమని హెచ్చరిస్తున్నారు. చేతులతో శుభ్రం చేస్తే బ్రష్‌లు పూర్తిగా శుభ్రపడవని అనుకుంటున్నారా? మేకప్‌ బ్రష్‌లను సులువుగా శుభ్రం చేయడానికే ఈ మేకప్‌ బ్రష్‌ క్లీనర్‌ అందుబాటులోకి వచ్చింది. చిత్రంలోని ఎలక్ట్రిక్‌ మేకప్‌ బ్రష్‌ క్లీనర్‌ తరచుగా మేకప్‌ వేసుకునే వారికి చక్కగా ఉపయోగపడుతుంది. 

ఇది అన్ని సైజ్‌లలోని కాస్మెటిక్‌ మేకప్‌ బ్రష్‌ కిట్‌లకు అనువుగా ఉంటుంది. ఇది బ్రష్‌లను పూర్తిగా శుభ్రం చేయడమే కాకుండా, వెంటనే పొడిగా ఆరబెడుతుంది కూడా! బ్రష్‌ కుచ్చు ఊడిపోకుండా, బ్రష్‌కు ఏమాత్రం డ్యామేజ్‌ కాకుండా శుభ్రం చేస్తుంది. మేకప్‌ అవశేషాలను, నూనె లేదా క్రీమ్స్‌తో వచ్చే జిడ్డును, మలినాలను పూర్తిగా తొలగిస్తుంది. 

దీనిని వాడుకోవడం చాలా తేలిక. ఐషాడో బ్రష్‌ల నుంచి పౌడర్‌ బ్రష్‌ల వరకు అన్నింటినీ దీనితో క్లీన్‌ చేసుకోవచ్చు. గర్ల్‌ ఫ్రెండ్, వైఫ్, మదర్‌ లేదా సిస్టర్‌ ఇలా రిలేషన్స్‌ ఏదైనా వారి స్పెషల్‌ డేకి ఈ డివైస్‌ని అందిస్తే పర్ఫెక్ట్‌ గిఫ్ట్‌ అవుతుంది. దీని ధర కేవలం రూ.600 మాత్రమే. ఇతర కంపెనీల్లో క్వాలిటీని బట్టి ధరల్లో తేడా ఉండొచ్చు. రివ్యూలను పరిశీలించి, ఇలాంటి పరికరాలను కొనుగోలు చేసుకోవచ్చు. 

(చదవండి: వాన చినుకులలో వడ్డన..!)

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు