Breaking News

బెస్ట్‌ టూరిస్ట్‌ స్పాట్‌

Published on Sun, 06/08/2025 - 00:39

రియో డి జనీరో– బ్రెజిల్‌లోని ఒక పెద్ద, అందమైన నగరం. ఇది అద్భుతమైన బీచ్‌లకు, పర్వతాలకు, ఉత్సాహభరితమైన కార్నివాల్‌ వేడుకలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కోపాకబానా, ఇపనేమా అనే బీచ్‌లు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. ఇవి అందమైన ఇసుక తిన్నెలతో, అహ్లాదకరమైన వాతావరణానికి నిలయమనే చెప్పుకోవాలి. కోర్కోవాడో పర్వతంపైనున్న ఈ భారీ జీసస్‌ విగ్రహం రియోకు ఒక చిహ్నం.

ఇది 2007లో న్యూ సెవెన్‌ వండర్స్‌ ఆఫ్‌ ది వరల్డ్‌లో స్థానం దక్కించుకుంది. అక్కడి షుగర్‌లోఫ్‌ మౌంటైన్‌ మీదున్న కేబుల్‌ కార్‌ ఎక్కితే ఆ నగరాన్ని మొత్తం వీక్షించవచ్చు. ప్రపంచంలోనే అతి పెద్ద క్రైస్తవ కార్నివాల్‌ ఈ నగరంలోనే ఘనంగా నిర్వహిస్తుంటారు. అలాగే ఈ నగరం ప్రపంచమే మెచ్చే.. సాంబా నృత్యాలకు పుట్టినిల్లు.

చెప్పుకోదగ్గ పోటీలు
ఆస్ట్రేలియాకు చెందిన ‘డార్విన్‌ బీర్‌ క్యాన్‌ రిగటా ఫెస్టివల్‌’ ఒకటి. ప్రతి ఏడాది జరిగే ఈ వేడుకను చాలా వినోదాత్మకంగా నిర్వహిస్తారు. ఖాళీ బీర్‌ బాటిళ్లు, ప్లాస్టిక్‌ సీసాలు, పాల డబ్బాలు ఇలా ఉపయోగం లేనివాటిని ఉపయోగించి తయారుచేసిన పడవలతో బీచ్‌లో పోటీపడటం ఈ వేడుకల్లో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ పోటీలను 1974లో లయన్స్ క్లబ్‌ ఆఫ్‌ డార్విన్‌ కమ్యూనిటీ సభ్యులైన లట్జ్‌ ఫ్రాంకెన్ ఫెల్డ్, పాల్‌ రైస్‌–చాప్‌మాన్‌ అనే వ్యాపారవేత్తలు ప్రారంభించారు.

 ఆస్ట్రేలియా ఉత్తర ప్రాంతంలోని డార్విన్‌ వీధుల్లో చెల్లాచెదురుగా ఉన్న చెత్తను శుభ్రం చేయడానికి సరైన మార్గంగా ఈ పడవల తయారీ, పోటీ అనే ఆలోచన వచ్చింది. దాన్ని ప్రారంభించినప్పుడే మంచి స్పందన రావడంతో దాన్ని ప్రతి ఏడాదీ కొనసాగిస్తున్నారు. మిండిల్‌ బీచ్‌లో జరిగే ఈ పండుగలో పాల్గొనేవారు వేలాది డబ్బాలతో సృజనాత్మకంగా పడవలను తయారు చేస్తారు. కొన్ని పడవలు పోటీ మధ్యలో విరిగిపోతుంటాయి. దానితో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందే జాగ్రత్తపడటంతో విరిగిపోవడం కూడా వినోదాన్ని పండిస్తుంది.

ఇక ఈ ఏడాది ఈ పండుగ జూన్‌ 8న జరుగుతోంది. పడవ పోటీలతో పాటు, ఇసుక కోటల నిర్మాణం, థాంగ్‌ త్రోయింగ్‌ వంటి ఇతర సరదా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. లయన్స్ క్లబ్‌ ఆఫ్‌ డార్విన్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనితో వచ్చే నిధులు స్థానిక కమ్యూనిటీ ప్రాజెక్టులకు ఉపయోగపడతాయి. ఈ సంబరాల్లో ‘థాంగ్‌ త్రోయింగ్‌ కాంపిటీషన్‌’ కాస్త వింతైన కామెడీ పోటీ. ఈ పోటీలో పోటీదారులు తమ తేలికపాటి చెప్పు(ఫ్లిప్‌ఫ్లాప్‌)లను దూరంగా విసురుతారు. ఎవరు ఎంత ఎక్కువ దూరం తమ చెప్పును విసరగలిగితే వాళ్లే గెలిచినట్లు. ఇక ఈ వేడుకలో భాగంగా ఐరన్ పర్సన్‌ కాంపిటీషన్, టగ్‌–ఆఫ్‌–వార్‌ ఇలా మరిన్ని పోటీలు జరుగుతుంటాయి. పైగా ఈ పోటీలను జూనియర్లకు వేరుగా, సీనియర్లకు వేరుగా, గ్రూప్‌ పోటీలు వేరుగా నిర్వహిస్తారు. దాంతో ఈ వేడుకలో వీక్షకులు, పోటీదారులతో సందడి మామూలుగా ఉండదు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)