Breaking News

డైట్‌ చేస్తున్నారా? బెస్ట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ రాగుల ఉప్మా

Published on Mon, 11/04/2024 - 16:00

బరువు తగ్గాలనే ఆలోచనలోఉన్నవాళ్లు  కొన్ని ఆహార నియమాలను పాటిస్తూ డైటింగ్‌ చేస్తూ ఉంటారు.  ముఖ్యంగా కొవ్వుపదార్థాలు, కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా లభించే ఆహారాలను దూరంగా ఉంటారు. ఇలాంటి సమయంలో ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, లేదా రాత్రికి  అన్నం మానేసి ఏం తినాలి అనేది పెద్ద సమస్య. ఇ‍డ్లీ, దోసలు, నూనెతో నిండిన పూరీలు కూడా రాగులతో ఉప్మాఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది బ్రేక్‌ఫాస్ట్‌ బెస్ట్‌ ఆప్షన్‌. కడుపు నిండుగా ఉంటుంది. పోషకాలు లభిస్తాయి కూడా.
 

రాగి ఉప్మా 
కావలసినవి: రాగి రవ్వ– కప్పు; నీరు – రెండున్నర కప్పులు; ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు; ఉప్పు – అర టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి; నూనె లేదా నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్‌లు; కరివేపాకు – 2 రెమ్మలు; పచ్చిమిర్చి – 2 (తరగాలి); ఇంగువ – చిటికెడు; ఆవాలు – అర టీ స్పూన్‌; జీలకర్ర – అర టీ స్పూన్‌; వేరుశనగపప్పు – 3 టేబుల్‌ స్పూన్‌లు; అల్లం తరుగు – టీ స్పూన్‌; పచ్చి శనగపప్పు – అర టేబుల్‌ స్పూన్‌; మినప్పప్పు – టీ స్పూన్‌; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్‌లు; నిమ్మకాయ –1 (పలుచగా తరగాలి).

తయారీ: ∙రాగి రవ్వను కడిగి నీటిని వడపోయాలి. రవ్వ మునిగేటట్లు నీటిని పోసి అరగంట సేపు నాన పెట్టాలి. తర్వాత నీటిలో నుంచి రవ్వను తీసి పిడికిలితో గట్టిగా నొక్కి నీరంతా ΄పోయేటట్లు చేసి (ఇడ్లీ రవ్వలాగానే) పక్కన పెట్టాలి బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేగిన తర్వాత అందులో ​ఉల్లియ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత రవ్వ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ఈ లోపు పక్కన మరో స్టవ్‌ మీద నీటిని వేడి చేయాలి. రవ్వ వేగి మంచి వాసన వచ్చేటప్పుడు ఉప్పు వేసి నీటిని పోసి కలిపి రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు కలిపి బాణలి మీద మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి మళ్లీ మూత పెట్టాలి ∙ రాగి రవ్వకు బొంబాయి రవ్వకంటే ఎక్కువ నీరు పడుతుంది కాబట్టి ఒకసారి చెక్‌ చేసుకొని,  రవ్వ ఉడకలేదు అనుకుంటే కాసిన్ని నీళ్లు జల్లి మూత పెట్టుకోవాలి. వేడి వేడి ఉప్మాను పల్లీ, అల్లం, మరేదైనా మనకిష్టమైన చట్నీతోగానీ తినవచ్చు.

ఇలాగే ఓట్స్‌తోగానీ,  గోధుమ రవ్వతో గానీ చేసుకోవచ్చు.  ఇందులో మనకు నచ్చిన కూరగాయ ముక్కల్ని, బఠానీలను కూడా యాడ్‌ చేసుకుంటే  రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం.

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)