Breaking News

మీసాలు.. గడ్డాలకు భేషైన తైలాలు

Published on Sat, 01/25/2025 - 17:24

మింగ మెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె అని మనకో సామెత ఉంది. స్తోమతకు మించి డాబులొలికే దిలాసారాయుళ్ల తీరును ఎద్దేవా చేయడానికి పుట్టిన సామెత అది. ఆనాటి సమాజంలో సంపన్నులైన పెద్దమనుషులు మీసాలకు సంపెంగ నూనెలు, ఇతరేతర సుగంధ తైలాలను పూసుకుంటూ, దర్జా ప్రదర్శించేవారు. ఇదివరకు కాస్త వయసు మళ్లినవాళ్లే ఏపుగా గడ్డాలు పెంచేవాళ్లు. 

ఇటీవలి కాలంలో కుర్రాళ్లు కూడా ఎడాపెడా గడ్డాలు పెంచేసుకుంటున్నారు. కొందరు అడ్డదిడ్డంగా గడ్డాలు పెంచుకుంటూ, చిరిగిన జీన్స్‌ తొడుక్కుని వీథుల్లో ఆవారాగా తిరుగుతుంటే, ఇంకొందరు సూటు బూట్లు ధరించి, పద్ధతిగా గడ్డాలను రకరకాల తీరుల్లో కత్తిరించుకుంటూ, గడ్డాలు దట్టంగా పెరగడానికి నానా రకాల పోషక తైలాలు వాడుతున్నారు. 

గడ్డాల మీద యువతరం మోజు గమనించిన మార్కెట్‌ శక్తులు ఊరుకుంటాయా? యువకుల మోజును సొమ్ము చేసుకోవడానికి గడ్డాల పోషణకు ప్రత్యేకంగా రూపొందించిన రకరకాల తైలాలను మార్కెట్‌లో ముంచెత్తుతున్నాయి. బియర్డ్‌ ఆయిల్స్, బియర్డ్‌ క్రీమ్స్‌ పురుషుల సౌందర్య ఉత్పత్తులలో కీలకంగా మారి΄ోయాయి. తలకు రాసుకునే హెయిరాయిల్స్, బ్రిలియంటైన్స్, జెల్స్‌తో పోల్చుకుంటే మీసాలు గడ్డాలకు పూసుకునే బీర్డ్‌ ఆయిల్స్, క్రీమ్స్‌ ధరలు నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటున్నా, గడ్డాలరాయుళ్లు ఏమాత్రం వెనుకాడటం లేదు. 

గడ్డం సంరక్షణ, పద్ధతులు

  • గడ్డం వేగంగా పెరగాలంటే ముఖాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోండి

  • మంచి చర్మ సంరక్షణ నియమాన్ని పాటించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండి, జుట్టు పెరుగుదలకు మెరుగైన వాతావరణం ఉంటుంది.

  • టీనేజర్లు రోజుకు రెండుసార్లు తేలికపాటి క్లెన్సింగ్ జెల్ లేదా సబ్బు, గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. దీంతో రంధ్రాలు ఓపెన్‌ అవుతాయి.

  • అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం, బోర్డు-సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ ప్రకారం గడ్డాన్ని మాయిశ్చరైజింగ్,  బీర్డ్‌  ఆయిల్‌తో మసాజ్ చేయడం ఆరోగ్యంగా ఉంచడానికి కీలకం. 

  • ముఖం,గడ్డాన్ని సున్నితమైన క్లెన్సర్‌తో శుభ్రపరచడం, మాయిశ్చరైజర్‌ను ఉపయోగించడం ముఖ్యం.
    అలాగే  గ్రూమింగ్ కోసం మంచి  నూనె లేదా కండిషనర్‌ను పూయడం లాంటివి పాటించాలి.

  • చనిపోయిన చర్మ కణాలను ఎక్స్‌ఫోలియేట్ చేయాలి.వారానికి కనీసం రెండుసార్లు  మృతచర్మ కణాలను తొలగించడానికి ,చర్మాన్ని క్లియర్ చేయడానికి మంచి ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్‌ను ఉపయోగించాలి. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది 

  • చర్మాన్ని తేమగా , హైడ్రేట్ గా ఉండాలి. ఇందకు తగినన్ని నీళ్లు తాగడం చాలా అవసరం.

కీలక సూచనలు

  • తాజాపండ్లు, కూరగాయలు , మాంసకృత్తులు, సమతులమైన ఆరోగ్యకరమైన తీసుకోవాలి. 

  • B1, B6 , B12 వంటి విటమిన్ లోపాలు టీనేజర్లలో మీసాలు, గడ్డాల పెరుగుదలను ఆలస్యం కావచ్చు. దీన్ని గమనించుకోవాలి.

  • రోజువారీ వ్యాయామం చేయడం, ముఖం శుభ్రంగా ఎప్పటికపుడు కడుక్కోవడం, ఎక్స్‌ఫోలియేట్ చేయడం లాంటివి చేయాలి. యూకలిప్టస్ బేస్డ్‌ మాయిశ్చరైజరింగ్‌, కనీసం 8 గంటల నిద్ర  కచ్చితంగా పాటించాలి.

చదవండి : తేగలతో ఎన్ని ప్రయోజనాలో! ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా?

గోవాబీచ్‌లో, సాయం సంధ్యలో.. మలైకా సన్‌బాత్‌



 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)