Breaking News

ఆరోగ్యంగా, అందంగా యంగ్‌ లుక్‌ కావాలా.. ఈ చిట్కాలు పాటించండి!

Published on Fri, 07/12/2024 - 16:43

వయసు పైబడుతున్న కొద్దీ అందంగా, ఫిట్‌గా కనిపించమేమోననే బెంగ అందర్నీ పట్టి పీడిస్తూ ఉంటుంది. అయితే, కొన్ని సూచనలు పాటిస్తే ఆరోగ్యంతోపాటు, మెరిసే చర్మాన్ని  కాపాడకోవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.  అవేంటో ఒకసారి చూద్దాం.

వయసు 40 దాటే సరికి, ముఖ వర్చస్సు తగ్గడం, ముడ‌త‌లు, చ‌ర్మం సాగ‌డం వంటి సమస్యలు మొదలవుతాయి. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ మార్పులు చాలా తొందరగా  కనిపిస్తాయి. చర్మం నిగారింపు కోల్పోతుంటుంది. పెళ్లి, పిల్లలు తరువాత స్త్రీలలో జరిగే శారీరక మార్పులు, హార్మోన్ల ప్రభావమే దీనికి కారణం.


జీవన శైలి, ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని మాత్రమేకాదు, బయటికి మనం కనిపించే తీరును కూడా ఎంతగానో ప్రభావితం చేస్తాయి. వృద్ధాప్య ఛాయలు తొందరగా కనిపించకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో సరిపడా పోషకాలు ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పని వ్యాయామం కూడా కీలకమే. 

ఆరోగ్యంగా ఉండాలంటే, చక్కటి ఆహారం, సరిపడా నిద్ర, క్రమం తప్పని వ్యాయామం.  వ్యాయామం శరీరాన్ని యవ్వనంగా ఉంచుతుంది. వాకింగ్‌, స్విమ్మింగ్‌, యోగా, ధ్యానం, ఏరోబిక్​ వ్యాయామాలు శారీరక దృఢత్వాన్ని పెంచుతాయి. వ్యాయామం  కొల్లాజెన్‌ ఉత్పత్తికి  సాయం చేస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, చేపలు, గింజలు  ఆహారంలో  చేర్చుకోవాలి.
సరిపడా నీళ్లు తాగాలి.

చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొల్లాజెన్​ అవసరం. ఇది చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయం చేస్తుంది. ఎముకలు బలంగా, దృఢంగా ఉండేలా చేస్తుంది.

విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు  ఉన్న ఆహారం  తీసుకోవడం వల్ల కూడా కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.
ఎక్కువ  ఎండకు, ఎక్కువ చలికి  ఎక్స్‌పోజ్‌  కాకూడదు. రసాయన రహిత క్లెన్సింగ్​, టోనింగ్​, మాయిశ్చరైజర్​ వాడకం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖం చర్మం సాగిపోకుండా,  బిగుతుగా ఉంచేందుకు ఫేషియల్​ మాస్కులు కొంతవరకు  పనిచేస్తాయి.

అలాగే ప్రభావవంతమైన యాంటీ ఏజింగ్ స్కిన్‌కేర్ ఉత్పత్తులు, యాంటీ ఏజింగ్ క్రీమ్‌లు, హైడ్రేటింగ్ సీరమ్‌లు, హైలురోనిక్ యాసిడ్, విటమిన్లు, నర్చరింగ్ ఆయిల్స్, షియా బటర్ ఉన్న మాయిశ్చరైజర్‌లను  వైద్య నిపుణుల పర్యవేక్షణలో వాడవచ్చు.

నోట్‌ : మనిషికి ముసలితనం రావడం, యవ్వనంలోని అందాన్ని కోల్పోవడం సహజం. అయితే ఆరోగ్యంగా ఉండేందుకు, పోషకాలతో నిండిన ఆహారం, చక్కటి వ్యాయామం, ఇతర ఆరోగ్య సూత్రాలను పాటించాలి. మానసిక,శారీరక ఆరోగ్యం బాహ్య సౌందర్యాన్ని ప్రభావితం చేస్తాయి.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)