Breaking News

నిమిషాల్లో ఐస్‌క్యూబ్స్‌.. జర్నీలో చక్కగా పనికొస్తుంది

Published on Tue, 09/19/2023 - 16:52

ఫ్రిజ్‌లో ఐస్‌క్యూబ్స్‌ తయారు చేసుకోవాలంటే, కొన్ని గంటల ముందుగానే ట్రేలో నీరు నింపి, డీప్‌ ఫ్రీజర్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. మామూలు రిఫ్రిజిరేటర్లలో ఐస్‌ తయారవడానికి ఆరు నుంచి పన్నెండు గంటల సమయం పడుతుంది. అయితే, ఈ ఫ్రిజ్‌లో ఐస్‌క్యూబ్స్‌ నిమిషాల్లోనే తయారవుతాయి. ఇళ్లల్లో వాడుకునే ఫ్రిజ్‌లను ఎక్కడికంటే అక్కడకు తీసుకుపోలేం. ఈ ఫ్రిజ్‌నైతే ఎక్కడికైనా ఈజీగా తీసుకుపోవచ్చు.

ఇది పోర్టబుల్‌ ఫ్రిజ్‌. సాధారణ ఫ్రిజ్‌ల కంటే చాలా తేలిక కూడా. కాస్త పెద్ద సూట్‌కేసు సైజులో ఉండే ఈ ఫ్రిజ్‌కు చక్రాలు కూడా ఉంటాయి. కాబట్టి మోత బరువు లేకుండానే దీనిని కోరుకున్న చోటుకు తేలికగా తరలించవచ్చు. ఇందులోని ట్రేలో నీరు నింపేసి పెడితే, కేవలం పన్నెండు నిమిషాల్లోనే పద్దెనిమిది ఐస్‌క్యూబ్స్‌ తయారవుతాయి. ఇందులో నీళ్లు, పాలు, కూల్‌డ్రింక్స్, కూరగాయలు, పండ్లు వంటివి భద్రపరచుకునేందుకు కూడా వీలవుతుంది.

ఇది పూర్తిగా సోలార్‌ చార్జబుల్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్‌చేస్తే, ఇరవై నాలుగు గంటల వరకు నిరాటంకంగా పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ద్వారా దీనిలోని అడ్జస్ట్‌మెంట్స్‌ను ఎక్కడి నుంచైనా మార్చుకోవచ్చు. అమెరికాకు చెందిన ‘ఎకో ఫ్లో’ కంపెనీ ఈ అత్యాధునిక పోర్టబుల్‌ రిఫ్రిజిరేటర్‌ను రూపొందించింది. దీని ధర 899 డాలర్లు (రూ.73,402) మాత్రమే! 

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)