Breaking News

మీకు తెలుసా

Published on Sat, 02/25/2023 - 04:08

జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్,ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎన్నో వ్యాధులనుంచి రక్షిస్తాయి. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

జీడిపప్పును ఒక్కొక్కరు ఒక్కోలా తింటుంటారు. కొందరు పచ్చి జీడిపప్పును తింటే ఇంకొంతమంది వీటిని రాత్రి నానబెట్టి ఉదయం తింటుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం  ప్రకారం.. జీడిపప్పును పాలలో నానబెట్టి తింటే వాటి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఇది  రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది. 

ఇందుకోసం ఏం చేయాలంటే..?
రాత్రిపూట గ్లాసు పాలలో మూడు లేదా నాలుగు జీడిపప్పులను వేయండి. మరుసటి రోజు ఈ జీడిపప్పు తిని పాలను తాగండి. దాంతో మామూలుగా జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలకంటే అనేకరెట్లు అధిక ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యానికి మంచిదని మోతాదుకు మించి తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్త.  

ఉదయం లేచిన తర్వాత వేడి వేడిగా టీ కానీ, కాఫీ కానీ తాగనిదే చాలా మంది రోజు మొదలవ్వదు. చాలా మంది సమయం సందర్భం లేకుండా టీ తాగుతూ ఉంటారు. లేవగానే ఒకసారి టీ తాగడం.. టిఫిన్‌ చేశాక టీ తాగడం, మళ్లీ సాయంత్రం, మధ్యాహ్నం భోజనం తర్వాత ఇలా.. ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తుంటారు. అయితే.. భోజనం తర్వాత టీ కానీ కాఫీ గానీ తాగడం వల్ల మనకు తెలీకుండానే సమస్యలు కొని తెచ్చుకున్నవాళ్లం అవుతామట.

అదెలాగంటే... అన్నవాహిక అనేది ఒక పొడవాటి గొట్టం. ఇది మన నోటి నుంచి కడుపు వరకు ఉంటుంది. ఇది ద్రవాలు, లాలాజలం, నమిలిన ఆహారానికి వాహకంగా పనిచేస్తుంది. వేడి వేడి కాఫీ, టీలు ఎక్కువసార్లు తాగడం వల్ల అన్నవాహిక దెబ్బతిని క్యాన్సర్ల వంటివి వచ్చే ముప్పు ఉందట. అందువల్ల కాఫీ టీలు తాగేటప్పుడు అదీ మరీ వేడిగా తాగేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది. 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)