Breaking News

తెల్లజుట్టు నల్లగా, స్మూత్‌ అండ్‌ షైనీగా : సహజమైన బీట్‌రూట్‌ మాస్క్‌

Published on Wed, 08/28/2024 - 14:38

చిన్న వయసులోనే తెల్లగా మెరిసిన జుట్టును నల్లగా మార్చుకోవడం ఒకపెద్ద సవాల్‌. మార్కెట్లోదొరికే రసాయనాలు కలిపిన హెయిర్‌డైలను వాడవద్దని  నిపుణులు హెచ్చరిస్తున్నారు. రసాయనాలు జుట్టుకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరమనీ,  ప్రమాదకరమైన కెమికల్స్‌ వల్ల కేన్సర్‌ ముప్పు పొంచి వుందని వైద్యులు కూడా చెబుతున్న మాట. 
 

హానికరమైన రసాయనాలు లేకుండా సహజంగా, ఇంట్లోనే దొరికే వాటితో  జుట్టు రంగు మార్చు కోవడం ఎలా? ఈ విషయంలో బీట్ రూట్ బాగా ఉపయోగపడుతుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

బీట్‌ రూట్‌లో  పొటాషియం, ఐరన్, ఫోలేట్, విటమిన్ సీ, ఏ,ఈ పుష్కలంగా లభిస్తాయి. కెరోటిన్‌తో కూడిన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. అలాగే ప్రోటీన్, మెగ్నీషియం , కాల్షియంకూడా అందుతాయి. ఇవి హెయిర్ ఫోలికల్స్  ఆరోగ్యాన్ని కాపాడతాయి. చర్మం , జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడతాయి.  ఇంకా ఇందులో రెటినోల్, ఆస్కార్బిక్ యాసిడ్, బీ కాంప్లెక్స్‌ లాంటి జుట్టు, చర్మానికి మేలు చేసే విటమిన్‌లు కూడా ఉన్నాయి.  

కొబ్బరి నూనె బీట్‌రూట్ రసం హెయిర్ మాస్క్
కొబ్బరి నూనెను బీట్‌రూట్ రసంలో కలిపి జుట్టుకు రాసుకుంటే సహజమైన రంగు సంతరించు కుంటుంది. అంతేకాదు జుట్టును తేమగా ఉంచుతుంది. కురులు మృదువుగా మారతాయి. బీట్‌రూట్ రసంలో కొబ్బరినూనె  కలిపిన పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసిన తర్వాత 2 గంటల పాటు అలాగే ఉంచి తర్వాత సాధారణ నీటితో జుట్టును కడగాలి. క్రమంగా తప్పకుండా ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా మారి, నిగనిగలాడుతుంది.

క్యారెట్, బీట్‌రూట్‌ మాస్క్‌: ఈ మిక్స్‌డ్‌ జ్యూస్‌ ఆరోగ్యానికి మాత్రమే కాదు, జుట్టు ఆరోగ్యానికి చాలా మంచింది. క్యారెట్,బీట్ రూట్‌ రసాన్ని తీసి, శుభ్రంగా వడకట్టి జుట్టుకు అప్లై చేయాలి.  దీని వల్ల జుట్టు మృదువుగా చక్కటి రంగులో మెరిసిపోవడం కాదే, చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.

బీట్‌రూట్ రసం బ్లాక్ కాఫీ హెయిర్ మాస్క్ 
జుట్టు రంగును మార్చడంలో బ్లాక్‌టీ, కాఫీ బాగా పనిచేస్తాయి. ఒక కప్పు బీట్‌రూట్ రసంలో, ఒకటిన్నర కప్పుల బ్లాక్ టీ లేదా కాఫీ (కాఫీ లేదా టీ పౌడర్‌ను నీటిలో బాగా మరగించి వడబోసుకోవాలి) కొద్దిగా  రోజ్ వాటర్  కలిపి ఈ మిశ్రమాన్ని వడబోసుకోవాలి. దీన్ని కుదుళ్లుకు పట్టేలాబాగా పట్టించాలి. ఒక గంట తర్వాత జుట్టును కడిగేసుకోవాలి.  చిక్కులు రాకుండా, జుట్టు తెగిపోకుండా సున్నితంగా దువ్వుకోవాలి.

బీట్‌రూట్, హెన్నా
జుట్టు సంరక్షణలో మరో సహజమైంది హెన్నా.దీనికి బీట్‌ రూట్‌ రసంజోడిస్తే ఫలితం బావుంటుంది. బీట్ రూట్ రసం, హెన్నా పౌడర్, కొద్దిగా బ్లాక్‌టీని వేసి  బాగా కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత జుట్టును శుభ్రంగా  కడిగేసుకోవాలి. మంచి ఫలితం రావాలంటే కనీసం రెండు మూడు వారాలకొకసారి పైన  చెప్పిన మాస్క్‌లను ప్రయత్నించాలి.  అలాగే  ఈ మాస్క్‌ వేసుకున్నపుడు షాంపూని వాడకూడదు.
 

Videos

ప్రభాస్ బర్త్‌డే స్పెషల్... కల్కీ 2 నుంచి అదిరిపోయే వీడియో

వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ లేఖ

మే. 2029 వరకు మీరు తగ్గకండి నేను తగ్గను... నేను చాగంటి లా ప్రవచనాలు చెప్పే రకం కాదు

భయపడేవాడు ఎవడూ లేడు... కోయ ప్రవీణ్.. ఖాకీ డ్రెస్ బదులు టీడీపీ జెండా కట్టుకో

RC 17 పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

ఏపీలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?

ధరల పెరుగుదలపై లోకేష్‌కు వరుదు కళ్యాణి సవాల్..!

మీకో దండం... మీ మీద నమ్మకం లేదు స్వామి సెక్యూరిటీ అని చెప్పి మమ్మల్ని...

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

Photos

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)