Breaking News

రుచికీ, ఆరోగ్యానికీ బీర.. బీరకాయ నువ్వుల పచ్చడి తయారీ ఇలా..

Published on Fri, 05/19/2023 - 10:47

డయాబెటిస్‌... హైబీపీ... రాజ్యమేలుతున్న రోజులివి. ఈ జంట సమస్యలు లేని ఇంటి కోసం భూతద్దంతో వెతకాల్సిందే.  స్క్రీన్‌లతో స్మార్ట్‌గా కళ్లకు అద్దాలు జోడవుతున్నాయి.  వీటికి జవాబులు మన ‘వంటిల్లు’లో వెతుకుదాం. వేడిని తగ్గించి, కంటికి మేలు చేసి, రక్తాన్ని వృద్ధి చేసే... బీరకాయతో... రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. బీరాలు పోవడం లేదు... బీరకాయ కూర చేస్తున్నాం. 

బీరకాయ నువ్వుల పచ్చడి
కావలసినవి:
►బీరకాయ ముక్కలు – కప్పు
►టొమాటో ముక్కలు – అర కప్పు
►చింతపండు– చిన్న గోళీ అంత
►మినప్పప్పు – టీ స్పూన్‌
►పచ్చి శనగపప్పు – టీ స్పూన్‌

►నువ్వులు – 2 టేబుల్‌ స్పూన్లు
►ఆవాలు– పావు టీ స్పూన్‌
►జీలకర్ర – పావు టీ స్పూన్‌
►ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి – 6
►నూనె – టీ స్పూన్‌
►ఉప్పు – టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి.

పోపు కోసం... ఆవాలు– అర టీ స్పూన్‌
►జీలకర్ర– అర టీ స్పూన్‌
►వెల్లుల్లి రేకలు – 6
►కరివేపాకు రెమ్మలు – 2
►తెల్ల నువ్వులు – అర టీ స్పూన్‌.

తయారీ:
►మందపాటి పెనంలో (నూనె లేకుండా) పచ్చి శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, మిర్చి, జీలకర్ర వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.
►అదే పెనంలో నూనె వేడి చేసి బీరకాయ ముక్కలను ఒక మోస్తరుగా వేయించి పక్కన పెట్టాలి.
►అదే పెనంలో టొమాటో ముక్కలను వేసి సన్న మంట మీద మగ్గనివ్వాలి. 
►ఈలోపు వేయించిన గింజలు, మిర్చి చల్లారి ఉంటాయి.

►వాటిని మిక్సీ జార్‌లో మెత్తగా చేసి అందులో బీరకాయ ముక్కలు వేసి గ్రైండ్‌ చేయాలి.
►చివరగా టొమాటో ముక్కలు, చింతపండు, ఉప్పు వేసి గ్రైండ్‌ చేయాలి
►ఇప్పుడు పోపు పెట్టాలి.
►పెనంలో నూనె వేడి చేసి పోపుకోసం తీసుకున్న దినుసులన్నీ వేసి వేగిన తరవాత అందులో మిక్సీలో గ్రైండ్‌ చేసిన చట్నీని వేసి కలిపితే బీరకాయ చట్నీ రెడీ. ఇది ►ఇడ్లీ, దోశెలు, చపాతీలు, అన్నంలోకి కూడా మంచి రుచినిస్తుంది.   

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)