Breaking News

దువ్వెనను ఇలా ఎంచుకోండి!

Published on Wed, 06/17/2026 - 17:10

చాలామంది జుట్టు సంరక్షణ అనగానే రకరకాల షాంపూలు, హెయిర్‌ ఆయిల్స్, కండిషనర్ల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కానీ, మనం రోజూ వాడే దువ్వెన కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని గమనించరు. కర్లీ జుట్టయినా, స్ట్రెయిట్‌గా ఉన్నా... సరైన దువ్వెనను వాడటం వల్ల జుట్టుకు మంచి రక్షణ దొరుకుతుంది. మరి అలా సరైన దువ్వెనని ఎంచుకోవాలంటే కొన్ని చిట్కాలు...

వెడల్పాటి పళ్లున్న దువ్వెన: 
కర్లీ, వేవీ హెయిర్‌ ఉన్నవారికి వెడల్పాటి పళ్లు ఉండే దువ్వెనలు బాగా ఉపయోగపడతాయి. ఇవి జుట్టు చిక్కులను సులభంగా తొలగిస్తాయి. అలాగే జుట్టు విరిగిపోకుండా, కుచ్చుగా మారకుండా కాపాడతాయి.

సన్నటి పళ్లు ఉండే దువ్వెనలు: స్టెయిట్, పల్చని జుట్టు ఉన్నవారికి సన్నటి పళ్లు ఉండే దువ్వెనలు చక్కగా సరిపోతాయి. ఇవి జుట్టును చక్కగా దువ్వుకోవడానికి, నీట్‌గా స్టైల్‌ చేసుకోవడానికి బాగా పనికొస్తాయి.

చిక్కులు తీసే దువ్వెనలు: జుట్టు తడిగా ఉన్నప్పుడు చాలా బలహీనంగా ఉంటుంది. ఆ సమయంలో జుట్టు త్వరగా తెగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, తడి జుట్టుపై ‘డిటాంగ్లింగ్‌ కూంబ్‌’ ఉపయోగించడం వల్ల జుట్టు ఊడిపోకుండా, ఎటువంటి డ్యామేజ్‌ జరగకుండా చిక్కులను సులభంగా తొలగించుకోవచ్చు.

ఉడెన్‌ కూంబ్‌: కర్రతో చేసిన దువ్వెనలు జుట్టు మొత్తానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి స్కాల్ప్‌ను మృదువుగా మసాజ్‌ చేయడమే కాకుండా, జుట్టులో స్టాటిక్‌ కరెంట్‌ ఏర్పడకుండా తగ్గిస్తాయి. అంతేకాదు, తలలోని సహజ నూనెలను జుట్టు అంతటా సమానంగా వ్యాపించేలా చేసి, జుట్టు ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.

టెయిల్‌ కూంబ్‌: జుట్టును సమానంగా లేదా నీట్‌గా పాపిడి తీసుకోవడానికి టెయిల్‌ కూంబ్స్‌ ఎంతో అవసరం. హెయిర్‌ స్టైల్స్‌ చేసుకునేటప్పుడు జుట్టును వేర్వేరు సెక్షన్లుగా విభజించడానికి ఇవి పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. 

(చదవండి: ఆ డ్రైవర్‌ ఊహించని 'రైడ్ మెనూ'..! ఆ 45 నిమిషాల రైడ్‌ ఆమెకు..)

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)