Breaking News

ఎండకు చర్మం కమిలిపోకూడదంటే..!

Published on Fri, 04/04/2025 - 09:37

వేసవిలో చర్మ సంరక్షణ, మేకప్‌ గురించి కొంత ఆందోళన సహజం. ఎండకు చర్మం కమిలిపోవడం, మేకప్‌ చెదిరిపోవడం సహజంగా జరుగుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా...

  • ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్‌ రాసుకోవాలి. లేదంటే ఎస్‌పిఎఫ్‌ ఉన్న మేకప్‌ ఉత్పత్తులను ఎంచుకోవాలి. దీనివల్ల చర్మానికి రక్షణ లభిస్తుంది.

  • బయటకు వెళ్లినప్పుడు పట్టిన చెమటను తుడవడానికి టిష్యూ పేపర్‌ను ఉపయోగించాలి. చెమట పట్టిన చోట టిష్యూ పేపర్‌ను అద్దితే, త్వరగా పీల్చుకుంటుంది. దీని వల్ల మేకప్‌ చెదిరి΄ోకుండా ఉంటుంది.

  • మేకప్‌ తొలగించిన తర్వాత చర్మం విశ్రాంతి పొందడానికి హైడ్రేటింగ్‌ షీట్‌ మాస్క్‌ను ఉపయోగించవచ్చు. జిడ్డు పోవడానికి కీర, దోస రసం, అలొవెరా జెల్‌ మాస్క్‌లా వాడి, ఐదు నిమిషాల్లో చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీనివల్ల చర్మం తాజాగా మారుతుంది.

  • చెమట వల్ల చర్మంపై దద్దుర్లు వస్తుంటాయి. సబ్బులకు బదులు బాడీ, ఫేస్‌ వాష్‌లతో శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మంపై గల సూక్ష్మ రంధ్రాలు సహజ నూనెలు కోల్పోవు.

  • ఈ కాలం త్వరగా అలసట వచ్చేస్తుంటుంది. అందుకని, రోజూ పడుకునేముందు కళ్ల కింద అవకాడో లేదా అలొవెరా క్రీమ్‌ లేదా ఫిష్‌ ఆయిల్‌తో మృదువుగా వేలి కొనలతో అప్లై చేయాలి. లేదంటే ఐ క్రీమ్‌ వాడచ్చు. 

  • వారంలో రెండు సార్లు పాదాలను స్క్రబ్‌ చేసి, ఫుట్‌ క్రీమ్‌ను ఉపయోగించాలి. 

సంతోషి సౌందర్య నిపుణురాలు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)