Breaking News

జుట్టును స్టైలిష్‌గా మార్చడం కోసం..!

Published on Sun, 09/14/2025 - 09:51

వయసుతో సంబంధం లేకుండా ఆడవారంతా తమ జుట్టును అందంగా, ఆకర్షణీయంగా మార్చుకోవాలనే కోరుకుంటారు. ట్రెండ్‌కు తగ్గట్టుగా, అందరినీ ఆకట్టుకునేలా తమ కురులను మార్చుకోవాలని ఆశ పడతారు. అలాంటి వారి కోసం జుట్టును స్టైలిష్‌గా మార్చే పరికరమే ఈ డైసన్‌ ఎయిర్‌రాప్‌ ఐడీ 6 ఇన్‌ 1 మల్టీ స్టైలర్‌.

జుట్టు స్టైలింగ్‌ అంటే చాలామంది అధిక వేడి, జుట్టు చివర్లు చిట్లిపోవడం, గంటల తరబడి శ్రమ అని అనుకుంటారు. అయితే ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే అని చెబుతూ డైసన్‌ కంపెనీ ఈ పరికరాన్ని సృష్టించింది. ఈ డివైజ్‌ ఎక్కువ వేడి లేకుండా కేవలం ఎయిర్‌ ఫ్లో సాయంతో జుట్టును స్టైల్‌ చేస్తుంది. అధునాతన సాంకేతికతో ఇది మీ జుట్టుకు ట్రెండీ లుక్‌ను అందిస్తుంది. డైసన్‌ ఎయిర్‌రాప్‌ పరికరం బ్లూటూత్‌ కనెక్టివిటీతో పని చేస్తుంది. ముందుగా ఫోన్‌లో మై డైసన్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 

ఇందులో మీ వెంట్రుకల తీరు, అలాగే మీరు ఎలాంటి స్టైల్‌ కోరుకుంటున్నారో ముందుగానే సెట్‌ చేసుకోవచ్చు. ఇది మీకు ఎలాంటి స్టైల్‌ సరిపోతుందో కూడా సూచనలిస్తుంది. దీంతో జుట్టును ఎలా స్టైల్‌ చేసుకోవాలో అనే విషయంలో క్లారిటీ వస్తుంది. సెలెక్ట్‌ చేసుకున్న స్టైల్‌ ప్రకారం ఈ పరికరం మీ జుట్టుకు అందమైన రూపాన్ని ఇస్తుంది. డైసన్‌ ఎయిర్‌రాప్‌ ఆరు రకాల ఎటాచ్‌మెంట్స్‌తో లభిస్తుంది. ఈ పరికరంలో మూడు రకాల హీట్‌ సెట్టింగ్‌లు, 

3 రకాల స్పీడ్‌ సెట్టింగ్‌లు ఉన్నాయి. వీటి సాయంతో మీరు తడి జుట్టును ఆరబెట్టుకోవచ్చు. జుట్టుకు బౌన్సీ కర్ల్స్, అందమైన అలల రూపాన్ని సులభంగా అందించవచ్చు. ఈ పరికరంలోని లార్జ్‌ రౌండ్‌ వాల్యూమైజింగ్‌ బ్రష్‌ జుట్టుకు మంచి ఆకృతిని ఇస్తుంది. అలాగే దీనిలోని సాఫ్ట్‌ స్మూతింగ్‌ బ్రష్‌ చిక్కులను తొలగిస్తుంది. ఈ పరికరంలో అత్యాధునిక హీట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ఉంది. ఇది సెకెన్‌కు 40 సార్లు వేడిని చెక్‌ చేస్తుంది. 

దీంతో మీ జుట్టుకు వేడి కారణంగా ఎటువంటి డ్యామేజీ జరగదు. మొత్తంగా ఈ మల్టీ హెయిర్‌ స్టైలర్‌ సాయంతో బ్యూటీ పార్లర్‌ అవసరం లేకుండా, జుట్టుకు ఎలాంటి డ్యామేజీ కాకుండా ఇంట్లోనే రింగులు తిరిగే ముంగురులను సొంతం చేసుకోవచ్చు. దీని ధర రూ. 45,900.  

(చదవండి: 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)