Breaking News

జిడ్డుగా ఉంటే.. మేలైన ప్యాక్స్‌

Published on Fri, 04/25/2025 - 09:48

వేసవిలో చర్మం తరచూ జిడ్డు అవుతుంటుంది. ఎండ వేడికి చర్మం మండుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఈ సమస్య తగ్గడంతో పాటు చర్మానికి తాజాదనం రావాలంటే సహజ సిద్ధమైన ఉత్పాదనలు మేలు చేస్తాయి. 

అలోవెరా జ్యూస్‌కు, కొద్దిగా రోజ్‌వాటర్‌ కలిపి శరీరానికి తరచూ మసాజ్‌ చేస్తూ ఉంటే ఎండ కారణంగా నల్లబడిన చర్మం సహజకాంతికి వస్తుంది. చర్మం మండడం సమస్య కూడా తగ్గుతుంది. దురద, దద్దుర్లు.. ఇతర చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. 

జిడ్డుచర్మం గలవారికి వేసవి మరింత పరీక్ష పెడుతుంది. చమట అధికమై బయటి దుమ్ము, ధూళి చేరి చర్మం మరింత జిడ్డుగా తయారవుతుంది. పాలు, తేనె, నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి చర్మం కమిలి, నల్లబడిన చోట రాయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. 

వేప ఆకుల ముద్ద, నారింజ తొనల ముద్ద సమానపాళ్లలో తీసుకోవాలి. దీంట్లో చిటికెడు గంధం పొడి, ముల్తానీమిట్టి, తేనె, నిమ్మరసం, రోజ్‌వాటర్‌ కలిపి, ముఖానికి ΄్యాక్‌ వేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. 

టీ స్పూన్‌ నారింజ రసం, ఓట్స్, తేనె, గుడ్డులోని తెల్లసొన లేదా పెరుగు కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, వలయకారంగా మృదువుగా స్క్రబ్‌ చేయాలి. తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి.

బియ్యప్పిండిలో చిటికెడు పసుపు, తేనె, దోస రసం కలిపి పేస్ట్‌లా చేయాలి. ముఖానికి పట్టించి, ఆరాక శుభ్రపరుచుకోవాలి. మేనికి కూడా ఇది మేలైన ΄్యాక్‌. 

ఎండలో బయటికి వెళ్లి వచ్చిన తర్వాత ఐస్‌ప్యాక్‌ లేదా ఐస్‌ క్యూబ్‌తో ముఖానికి మృదువుగా రబ్‌ చేయాలి. ఎండవేడికి కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)