Breaking News

పెదవులు గులాబీ రంగులో మెరవాలంటే ..!

Published on Wed, 11/27/2024 - 10:59

చలికాలంలో పెదాలు పొడిబారినట్లుగా అయిపోయవడమే గాక ముఖం, చర్మం కాంతి విహీనంగా మారుతుంది. ఓపక్క పని ఒత్తిడి వల్ల కళ్లకింద నలుపు, ముఖంంపై ముడతలతో అందవిహీనంగా కనిపిస్తుంది. ఇలాంటి వాటిని ఆరోగ్యం కోసం తినే ఫ్రూట్స్‌తో చెక్‌పెడదాం.  అదెలాగో చూద్దామా..

  • కీరదోసకాయని చక్రాల్లా కోసుకుని కళ్ళమీద పెట్టుకుంటే కంటి అలసట తగ్గుతుంది. 

  • రెండు స్పూన్ల చల్లని పాలలో కాటన్‌ బాల్స్‌ని ముంచి కళ్ళ చుట్టూ వలయాకారంగా మర్ధించి 20 నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కంటి కింద నలుపు తగ్గి అందంగా ఉంటాయి. 

  • మెడ మురికి పట్టేసినట్లు నల్లగా ఉంటే... నాలుగు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో రెండు స్పూన్ల బియ్యప్పిండి కలిపి మెడకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మానికి పట్టిన నలుపుతోనాటు ముడతలుపోతాయి.

  • టీ స్పూన్‌ అరటిపండు గుజ్జులో టీస్పూన్‌ తేనె కలిపిన మిశ్రమాన్ని పెదవులకు రాసి మసాజ్‌ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే నల్లని పెదవులు గులాబీ రంగులోకి మారతాయి.

  • టీస్పూన్‌ పాల మీగడ, అయిదారు గులాబి రేకులు తీసుకుని పేస్ట్‌ చేసిన మిశ్రమాన్ని పెదవులకు రాసుకుంటే పెదవులు పొడిబారకుండా మృదువుగా ఉంటాయి. 

  • చలికాలంలో లిప్‌స్టిక్‌ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. లిప్‌ గార్డ్, మీగడ, వెన్న, నెయ్యి వంటివి రాసుకుంటూ ఉంటే పెదవులు పొడిబారకుండా అందంగా ఉంటాయి. 

  • టీ స్పూన్‌ ఆపిల్‌ గుజ్జులో టీ స్పూన్‌ అరటిపండు గుజ్జు, అయిదారు చుక్కల తేనె వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఫేస్‌ మాస్క్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ఏర్పడ్డ ముడతలు, జిడ్డు తగ్గి ముఖం మెరుస్తూ కాంతివంతంగా ఉంటుంది.  

(చదవండి: ఐపీఎల్‌ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)