Breaking News

అందంగా ఉండాలంటే..సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి..!

Published on Fri, 03/28/2025 - 10:10

అందంగా ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందనేది అందరూ అంగీకరించాల్సిందే. యవ్వనంగా కనిపించాలనే తాపత్రయంతోనే జీవనం నాణ్యంగా గడపడానికీ ప్రయత్నించాలి. అందుకు బ్యూటీ చికిత్సలకు ఎక్కువ ఖర్చు పెట్టనవసరం లేదు. నేటి రోజుల్లో కాలుష్యం, సమతుల ఆహార  లోపం, స్ట్రెస్‌ .. వీటన్నింటి ప్రభావం చర్మంపై పడుతుంది. అందుకని సమస్య ఎక్కడ ఉన్నదో దానిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి.

చాలా మంది ఎదుర్కొనేవి... 
యవ్వనంలో ఉన్నవాళైతే యాక్నె, మంగు మచ్చలు, కాస్మొటిక్స్‌ వాడకం వల్ల ఏర్పడే మచ్చల సమస్య ఉంటుంది. వీటికి ఇంట్లోనే సొంత చికిత్సలు తీసుకోవడం వల్ల మరికొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు.. మొటిమలకు వెల్లుల్లి, టూత్‌పేస్ట్‌ వంటివి వాడుతుంటారు. మంగు మచ్చలకు తమకు తామే స్టెరాయిడ్స్‌ వాడుతుంటారు. ఇక శిరోజాల విషయంలో అయితే ఐరనింగ్, స్ట్రెయిటనింగ్, స్టయిలింగ్‌.. వంటి హెయిర్‌స్టైల్స్‌ ఎక్కువైపోయాయి. వీటివల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. జుట్టు ఊడిపోవడం పెరుగుతుంది.

బట్టల వల్ల అలెర్జీ
టైట్‌గా ఉండే బట్టలు వేసుకుంటుంటారు. ఫ్యాబ్రిక్‌ వల్ల దురద సమస్యలు వస్తుంటాయి. అవి, నిర్లక్ష్యం చేస్తే కుటుంబంలో మిగతా వారికీ ఆ ఇన్ఫెక్షన్‌ వ్యాపిస్తుంది. పులిపిర్లు ప్రైవేట్‌ పార్ట్స్‌లో వస్తుంటాయి. వాటినీ నిర్లక్ష్యం చేస్తుంటారు. కాస్మొటిక్‌ ప్రయోగాలు అయితే చెప్పలేం. అవి తమ చర్మానికి సరిపడతాయో లేదో కూడా చూడరు. దీని వల్ల చర్మం రంగు మారుతుంది.

ఫేషియల్స్‌
ఫేషియల్స్‌ చేయించుకుంటుంటారు. ఫ్రూట్‌ ఫేషియల్స్‌ సాధారణ కాంతికి పనిచేస్తాయి. హైడ్రా ఫేషియల్, డెర్మాఫేషియల్స్, కెమికల్‌పీల్‌.. వంటి ఫేషియల్స్‌ నిపుణుల పర్యవేక్షణలోనే చేయించుకోవాలి. హెయిర్‌కి, స్కిన్‌కి పీఆర్‌పీ చేయించుకుంటారు. ఇవి చేయించుకున్నంత మాత్రాన అంతా బాగయిపోదు. సరైన మెయింటెనెన్స్‌ అవసరం.

చెయిన్లతో మెడపై నలుపు
ఆడవాళ్లలో చాలా వరకు మెడపైన నల్లగా అవుతుంది. ఆర్టిఫిషియల్‌ జ్యువెలరీ, శుభ్రత పాటించకపోవడం, అధిక బరువు వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అండర్‌ ఆర్మ్స్‌ డార్క్‌గా ఉన్నప్పుడు నిపుణుల సూచనలు తీసుకోవాలి. అధికబరువుకు లైపోసక్షన్‌ వంటివి చికిత్సలు తీసుకుంటారు. బరువు తగ్గినప్పుడు ఎలాంటి ఫిట్‌నెస్‌ సూచనలు పాటించాలో కూడా నిపుణుల సూచనలు తీసుకోవాలి.

స్ట్రెచ్‌ మార్క్స్‌
మహిళలకు ప్రసవం తర్వాత స్ట్రెచ్‌ మార్క్స్‌ పెద్ద సమస్య. ప్రసవం తర్వాత మూడవ నెల వరకు క్రీములు వాడుతూ ఉండాలి. అన్ని డెలివరీలు పూర్తయ్యాక స్ట్రెచ్‌ మార్క్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి. మరో సమస్య పాదాల పగుళ్లు. క్రీమ్‌ వాడితే దాని మీద దుమ్ము పేరుకుంటుంది. అందుకని, రాత్రి పడుకునేముందు పీదాలను శుభ్రం చేసి, క్రీమ్‌ రాసి, సాక్సులు ధరించాలి.

డిటర్జెంట్స్‌ వల్ల ఎగ్జిమా!
చేతులకు ఎగ్జిమా వస్తుంది. డిటర్జ్‌ంట్స్‌ వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అందుకని ఇంటి క్లీనింగ్‌లో చేతులకు గ్లౌజ్స్‌ మోచేతుల వరకు ఉండేవి మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని ఉపయోగించాలి.

పర్మనెంట్స్‌ చేయించుకుంటున్నారా..!
బ్యూటీ చికిత్సలలో పర్మనెంట్‌ మెథడ్స్‌కి ఇటీవల డిమాండ్‌ పెరిగింది. వాటిలో బొటాక్స్, ఫిల్లర్స్, స్కిన్‌ బూస్టర్స్, లిప్‌ కరెక్షన్, స్కిన్‌ టైటెనింగ్, గ్లోయింగ్‌ కోసం తీసుకునే ఇంజక్షన్స్‌.. ఈ కాస్మొటిక్స్‌ చికిత్సలన్నీ వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. రెగ్యులర్‌ మేకప్‌ చేసుకునేవారు కాస్మొటిక్స్‌ తమ చర్మతత్త్వానికి సరిపడేవి ఎంచుకోవాలి. తిరిగి శుభ్రం చేసుకోవడంలోనూ జాగ్రత్తలు పాటించాలి. 

(చదవండి: Ram Charan: రోజుకో వర్కవుట్‌.. ఆదివారం చీటింగ్‌! ఆ రూల్‌ మాత్రం తప్పడు!)

#

Tags : 1

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు