Breaking News

సహజ సిద్ధమైన యూత్‌ప్యాక్స్‌

Published on Fri, 03/03/2023 - 04:53

పార్టీలు, వేడుకలకు వెళ్లాలనుకొన్నప్పడు ముఖానికి తక్షణ నిగారింపు రావడం కోసం రకరకాల ఫేస్‌ప్యాక్‌లు ఉపయోగిస్తుంటారు. అయితే ఒక్కోసారి అవి అందుబాటులో ఉండవు. ఉన్నా, చర్మానికి పడవు. అలాంటప్పుడు... సహజసిద్ధమైన ఈ ఫేస్‌ప్యాక్స్‌ ప్రయత్నించండి. ఇవి మీ చర్మానికి తగిన పోషణను ఇవ్వడంతో పాటు యవ్వన కాంతినిస్తాయి. 

చందనం, రోజ్‌ వాటర్‌ 
చందనం ముఖం పై ఉన్న మృతకణాలను తొలగించి చర్మం మెరిసిపోయేలా చేస్తుంది. రోజ్‌వాటర్‌ చర్మానికి మెరుపునందిస్తుంది. వేసవిలో ఈప్యాక్‌ వేసుకోవడం ద్వారా సూర్యరశ్మి ప్రభావానికి గురైన చర్మానికి ఉపశమనం దొరుకుతుంది. ఇందుకోసం...
♦ గంధపు చెక్కను రోజ్‌ వాటర్‌తో అరగదీసి.. ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. మీ దగ్గర గంధపు చెక్క లేకపోతే.. దానికి బదులుగా గంధపు పొడిని ఉపయోగించవచ్చు. గంధం పొడిలో సరిపడినంత రోజ్‌ వాటర్‌ కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకొంటే సరిపోతుంది.

ఓట్‌ మీల్‌తో...
ఓట్‌మీల్‌ సహజసిద్ధమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు, ఇతర పోషకాలు చర్మానికి మెరుపునిస్తాయి. ఓట్‌ మీల్‌ సహజసిద్ధమైన క్లెన్సర్‌గా పనిచేసి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. రెండు టేబుల్‌స్పూన్ల ఓట్‌ మీల్‌లో టీస్పూన్‌ చందనం పొడి వేసి సరిపడినంత రోజ్‌ వాటర్‌ కలిపి పేస్టులా  తయారు చేయాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పావుగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు చల్లుకుంటూ మసాజ్‌ చేసుకొంటున్నట్టుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)