యవ్వన కాంతితో కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఉండాలంటే..

Published on Sun, 02/23/2025 - 11:39

వయసు పెరిగే కొద్ది, చర్మంలో చాలా మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా కంటి చుట్టూ నల్లటి వలయాలు, మచ్చలు, గీతలు, ముడతలు అందాన్ని చెడగొడుతుంటాయి. అలాంటి సమస్యకు చెక్‌ పెడుతుంది ఈ  ‘ఐ రీజెనరేటింగ్‌ టూల్‌’. దీన్ని వినియోగించడంతో కళ్లు మిరుమిట్లు గొలిపే అందంతో మృదువుగా మారతాయి. ముఖం యవ్వనకాంతితో మెరుస్తుంది.

ముందుగా కళ్ల కింద చర్మానికి అనువైన క్రీమ్స్, సీరమ్స్‌ అప్లై చేసుకుని, అనంతరం ఈ డివైస్‌ సాయంతో మసాజ్‌ చేసుకోవాలి. కేవలం క్రీమ్‌ అప్లై చేసి వదిలేయడానికీ, క్రీమ్‌ అప్లై చేసిన తర్వాత ఈ టూల్‌తో మసాజ్‌ చేయడానికీ తేడా స్పష్టంగా కనిపిస్తోందని, ఈ టూల్‌ బెస్ట్‌ రిజల్ట్స్‌ ఇస్తోందని చాలా మంది వినియోగదారులు రివ్యూస్‌ ఇస్తుండటంతో ఇలాంటి పరికరాలకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది.

ఈ పరికరంతో క్రీమ్‌ లేదా సీరమ్‌ను కంటి కింద అప్లై చేసుకుంటే, చర్మం 53 శాతం వేగవంతం రికవరీ అవుతోందట! నల్లటి వలయాలను 18 శాతం, పొడిబారిన చర్మం 32 శాతం, గీతలు, ముడతలు 16 శాతం తగ్గుతున్నాయని ఐ రీజెనరేటింగ్‌ టూల్‌ని రూపొందించిన కంపెనీ వెల్లడిస్తోంది. హె ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్‌తో, 38–42 డిగ్రీల సెల్సియస్‌ హీట్‌ థెరపీతో ఈ మసాజ్‌ డివైస్‌ పని చేస్తుంది. దీనిలోని లిఫ్టింగ్‌ మోడ్‌.. కంటి కండరాలను ఉత్తేజపరచేందుకు, కొలాజెన్‌ ఉత్పత్తిని ప్రేరేపించడానికి ఉపయోగపడుతుంది.

ఈ మసాజ్‌ హెడ్‌ కంటికి అనువుగా, చికిత్సకు వీలుగా డబుల్‌–కాంటాక్ట్‌ ప్రాంగ్‌లతో రూపొందింది. దీని హెడ్‌పైన రెండు సెమీ–కర్‌వ్డ్‌ హైపోఅలెర్జెనిక్‌ మెటల్‌ ఎలక్ట్రోడ్‌ పోల్స్‌ ఉండటంతో మసాజ్‌ చేసుకునేటప్పుడు అవి కంటి చర్మంపై సున్నితంగా జారుతూ, మంచి ఫలితాన్ని ఇస్తాయి.  

(చదవండి: మెనోపాజ్‌లో నిద్రలేమితో సతమతమవుతున్నారా..? బీకేర్‌ఫుల్‌..!)

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)