Breaking News

Bathukamma: మక్క సత్తు ముద్దలు తిన్నారా? ఇలా చేసుకోండి! ఆరోగ్య ప్రయోజనాలివే!

Published on Sat, 09/24/2022 - 12:46

బతుకమ్మ వేడుకల్లో భాగంగా ‘అమ్మ’కు వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక బతుకమ్మ అంటేనే సత్తుపిండి ఘుమఘుమలు ఉండాల్సిందే! ఎక్కువగా పెసరపప్పు, నువ్వులు, పల్లీలతో సత్తుపిండిని తయారు చేసుకుంటారు.

వీటితో పాటు మొక్కజొన్న గింజలతో చేసే సత్తు(మక్క సత్తు అని కూడా అంటారు)తో చేసిన ముద్దలు(లడ్డూలు) కూడా ఎంతో రుచికరంగా ఉంటాయి. మొక్కజొన్న గింజలు, బెల్లం లేదంటే చక్కెర.. నెయ్యి ఉంటే చాలు మక్క సత్తు ముద్దలు చేసుకోవచ్చు.

ఇలా తయారు చేసుకోండి
►ముందుగా మొక్కజొన్న గింజలు వేయించి.. చల్లారాక పొడి చేసుకోవాలి.
►అదే విధంగా బెల్లం తరుము లేదంటే పంచదారను పొడి చేసి పెట్టుకోవాలి.
►ఈ రెండింటి మిశ్రమంలో నెయ్యి వేసి ఉండలుగా చుట్టుకుంటే మక్క సత్తు ముద్దలు రెడీ.

మొక్కజొన్నతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! 
►మొక్కజొన్న వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 
►దీనిలో విటమిన్‌- ఏ, విటమిన్‌- బీ, సీ ఎక్కువ.
►మొక్కజొన్నలోని బీటా కెరోటిన్‌ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
►ఇందులో విటమిన్‌ బీ12, ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ పుష్కలం. ఇవి ఎర్రరక్త కణాల ఉత్పత్తికి తోడ్పడి.. రక్తహీనతను నివారించేందుకు దోహదపడతాయి. ఫోలిక్‌ యాసిడ్‌ గర్భవతులకు మేలు చేస్తుంది.

చదవండి: Malida Muddalu: మలీద ముద్దల తయారీ విధానం! వీటిని తింటే ఇన్ని ఆరోగ్య లాభాలా?!

Videos

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Bhogapuram: అభివృద్ధి సంకల్పం ఆ ఘనత జగన్ దే

చంద్రబాబు నివాసమున్న జిల్లాలోనే మహిళలపై పెరిగిన 11 శాతం నేరాలు

ఇంజనీరింగ్ నిపుణులే షాక్ అయ్యేలా అమరావతిలో భారీ దోపిడీ

AP: సైబర్ దొంగలు కోటి 23 లక్షలు కొట్టేశారు

Perni Nani: చిరంజీవి పెట్టిన బిక్ష

Photos

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)