Breaking News

చైతన్య లహరి

Published on Fri, 11/29/2024 - 01:15

చదువులో ‘శభాష్‌’ అనిపించుకున్న లహరి చదువే ప్రపంచం అనుకోలేదు. సమకాలీన సమాజం నుంచి కూడా ఎన్నో విషయాలను పాఠాలుగా నేర్చుకుంటోంది. విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహతో ముందడుగు వేస్తోంది.

‘మన కోసం మనమే కాదు ఇతరుల కోసం మనం’ అనే స్పృహతో రకరకాల సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగం అవుతున్న సిద్దిపేట జిల్లా తడకపల్లికి చెందిన బండోజీ లహరి బ్యాంకాక్‌లో జరిగిన ‘ఏషియా యూత్‌ ఇంటర్నేషనల్‌ మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌’ సదస్సులో ప్రసంగించింది...

‘ఇది ఆడవాళ్లకు సాధ్యం కాదు’ అనే మాట ఎన్నోచోట్ల విన్నది లహరి. ‘ఎందుకు సాధ్యం కాదు?’ అని ధైర్యంగా అడిగే వయసు కాదు. అయితే చిన్న వయసులోనే రకరకాల సందర్భాలలో శక్తిమంతమైన మహిళల గురించి విన్న లహరికి ‘మహిళలకు సాధ్యం కానిది లేదు’ అనే సత్యం బోధపడింది.

‘ప్రతిభావంతులతో పోటీ పడితే మనలోని ప్రతిభ కూడా మెరుగుపడుతుంది’ అనే పీటీ ఉష మాట ప్రభావంతో ఆటలపై ఆసక్తి పెంచుకుంది. ఎన్నో ఆటల్లో భాగం అయింది.

మదర్‌ థెరెసా గురించి విన్నప్పుడల్లా ఆమె చేసిన అపారమైన సేవా కార్యక్రమాలలో ఏ కొంచెం చేసినా జీవితం ధన్యం అయినట్లే అనుకునేది. ‘ఇతరుల కోసం జీవించని జీవితం జీవితం కాదు’ అనే మదర్‌ మాట లహరి మనసులో నాటుకుపోవడమే కాదు సామాజికసేవా కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకునేలా చేసింది. 

కరాటే...కిక్‌ బాక్సింగ్‌
బాసర ట్రిపుల్‌ఐటీలో ఆర్జీయూకేటీలో ఈసీఈ ఫైనలియర్‌ చదువుతోంది లహరి. ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలనే తపనతో ఉండే లహరి కరాటేలో బ్లాక్‌బెల్ట్‌ సాధించింది. కిక్‌ బాక్సింగ్‌లో ప్రాపావీణ్యం సాధించింది. ‘ఖేలో ఇండియా’లో ఉషూ ప్లేయర్‌గా సత్తా చాటింది.

అత్యవసరంగా రక్తం అవసరమున్నవారికి సహాయం అందించేందుకు సిద్ధిపేటలో ‘లహరి బ్లడ్‌ ఫౌండేషన్ ’ ఏర్పాటు చేసింది. మిత్రులతో కలిసి రక్తదానాలు చేయడం, చేయించేలా ప్రోత్సహించడం చేస్తోంది. కోవిడ్‌ టైమ్‌లోనూ రిస్క్‌ తీసుకుని సేవలందించింది. తాను నేర్చుకున్న ఆత్మరక్షణ విద్యలను విద్యార్థినులకు నేర్పిస్తోంది. బాసర ఆర్జీయూకేటీలోనూ స్టూడెంట్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ (ఎస్‌జీసీ) కౌన్సిల్‌ మెంబర్‌గా ఉంది. ట్రిపుల్‌ ఐటీలో ఆపదలో ఉన్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన ఈ ‘హోప్‌హౌజ్‌ ఫౌండేషన్’’ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటోంది.

ఇటీవల బ్యాంకాక్‌లో నిర్వహించిన ‘ఏషియా యూత్‌ ఇంటర్నేషనల్‌ మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్’ సదస్సుల్లో పాల్గొంది. 36 దేశాల నుంచి 699 మంది పాల్గొన్న ఈ సదస్సుకు మన దేశం నుంచి హాజరైన అయిదుగురిలో లహరి ఒకరు. ఈ సదస్సులో ‘ఉమెన్  ట్రాఫికింగ్‌ అండ్‌ మైగ్రేషన్  స్మగ్లింగ్‌’ అనే అంశంపై మాట్లాడిందామె.
నాన్నలాగే సైన్యంలో చేరి దేశసేవ చేయాలనేది లహరి లక్ష్యం. ఆమె లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం.
 

లెట్స్‌ షేప్‌ ఏ బెటర్‌ వరల్డ్‌
కొత్త ప్రదేశం అంటే భౌగోళిక విషయాల పరిచయం మాత్రమే కాదు. ఎన్నో విషయాలను తెలుసుకునే పుస్తక సముద్రం. ‘యూత్‌ సమ్మిట్‌’లో పాల్గొనడానికి బ్యాంకాక్‌కు వెళ్లిన లహరి ‘ఇక్కడ ప్రసంగించి వెళ్లిపోతే తన బాధ్యత పూర్తయిపోతుంది’ అనుకోలేదు. ఇటీవల థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ‘లెట్స్‌ షేప్‌ ఏ బెటర్‌ వరల్డ్‌’ నినాదంతో మొదలైన అంతర్జాతీయ యువ సమ్మేళనంలో వివిధ దేశాల నుంచి వైబ్రెంట్‌ డెలిగేట్స్‌ పాల్గొన్నారు. పర్యావరణ సంక్షోభం నుంచి సాంస్కృతిక విశేషాల వరకు ఎన్నో అంశాలపై ఎంతోమంది డెలిగేట్స్‌తో లహరి మాట్లాడింది. ఉద్యమ ప్రయాణంలో వారి అనుభవాలతో స్ఫూర్తి పొందింది. ‘బ్యాంకాక్‌ సమ్మిట్‌లో పాల్గొనడం గొప్ప అనుభవం’ అంటుంది లహరి. 

– రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్‌

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)