Breaking News

తాటి ఆకుల కళ..! 75 ఏళ్ల బామ్మ..

Published on Fri, 10/25/2024 - 10:33

అవసరం ఒక ఆవిష్కరణకు దారి వేసింది. ఆర్థిక అవసరాలే తనను హ్యాండీక్రాఫ్ట్‌ కళాకారిణిగా తీర్చిదిద్దాయని చెప్పారు బాల త్రిపుర సుందరి. తాటి ఆకులతో గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు తయారు చేస్తారామె. వీటి తయారీలో మహిళలకు శిక్షణనిస్తారు కూడా. తాటి ఆకు కళారూపాల తయారీలో యాభై ఏళ్ల అనుభవం ఆమెది. 

ఒక నిర్ణయం జీవితాన్ని మార్చేసింది! 
త్రిపుర సుందరికి 75 ఏళ్ల వయసు. ఆమెది తూర్పుగోదావరి జిల్లాలో ఓ కుగ్రామం. చదువుకు నోచుకోని త్రిపుర సుందరి 1972లో ముంబయికి వెళ్లి హస్తకళాకృతుల తయారీలో సర్టిఫికేట్‌ కోర్సు చేశారు. అక్కడ నేర్పించిన కళారూపాల తోపాటు తన క్రియేటివిటీతో మరికొన్ని రూపాలను తయారు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో హస్తకళాకృతుల ఎగ్జిబిషన్‌లలో స్టాల్‌ పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్, నెక్లెస్‌ రోడ్, పీపుల్స్‌ ప్లాజాలో పామ్‌ క్రాఫ్ట్‌ కళాకృతులను ప్రదర్శిస్తున్నారు.  

పనిలోనే ఆనందం 
‘‘మా ఊరిలో తెలిసిన వాళ్ల ద్వారా ముంబయిలో శిక్షణ కోర్సు గురించి తెలిసింది.. మూడు నెలల కోర్సు, బస భోజన వసతులు వాళ్లే ఏర్పాటు చేస్తారని చెప్పారు. చదువు లేదు, భాష ఇబ్బందవుతుందేమోనని భయంతోనే వెళ్లాను. కానీ అక్కడ తెలుగు వాళ్లు కూడా ఉండడంతో ఇబ్బంది కలగలేదు. క్రమంగా హిందీలో చెప్తున్న విషయాలు అర్థం కాసాగాయి. కోర్సు పూర్తయిన తర్వాత మా ఊరికి వచ్చి, నిడదవోలులో ఉన్న తాటిబెల్లం ఫెడరేషన్‌ లో ట్రైనర్‌గా ఉద్యోగంలో చేరాను. 

బదలీ మీద 1983లో హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కి వచ్చాను. ఖాదీ విలేజ్‌ ఇండస్ట్రీస్‌తో కూడా పని చేశాను. ఆ ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిన తర్వాత ఇప్పుడు కూకట్‌పల్లి, హౌసింగ్‌ బోర్డులో మా ఇంటి దగ్గర నాకు నచ్చిన కళారూపాలు అల్లుకుంటూ, ఎగ్జిబిషన్‌లలో స్టాల్‌ పెడుతున్నాను. వీటితోపాటు తుక్కుగూడలోని నీరా యూనిట్‌లో శిక్షణనిస్తున్నాను. 

బంధువులు, స్నేహితులు ఇంకా పని చేయడం ఎందుకని అడుగుతుంటారు. పిల్లల బాధ్యతలు పూర్తయ్యాయి, నేను పని చేయకపోతే అడిగేవాళ్లు కూడా లేరు. కానీ నాకు పని చేయకుండా కూర్చుని తినడం ఇష్టం ఉండదు. ఆరోగ్యం బాగున్నప్పుడు పని మానేయడం ఎందుకు?’’ అంటూ స్టాల్‌లో ఆమె బొమ్మల ధరలు అడుగుతున్న వారికి బదులివ్వడంలో మునిగిపోయారామె.  

-విఎమ్‌ఆర్‌
ఫోటోలు: ఎస్‌ఎస్‌ ఠాకూర్‌

(చదవండి: నగదు రహిత చెల్లింపుల్లో అంతకుమించి..!వాట్‌ ఏ టెక్నాలజీ..?)

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)