Bakrid 2025: జిల్‌ హజ్‌ మొదటి పది రోజుల ప్రాముఖ్యం

Published on Thu, 05/29/2025 - 11:36

జిల్‌ హజ్‌ పదవ తేదీన జరుపుకొనే బక్రీద్‌ ఒక అపూర్వమైన పండుగ. హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ , హజ్రత్‌ ఇస్మాయీల్‌ అలైహిముస్సలాంల త్యాగాలను స్మరించుకునే త్యాగోత్సవం. ప్రపంచ విశ్వాసుల పర్వదినం. ఇదేదో షరా మామూలుగా జరిగే ఆచారం కాదు. ఇదొక మహత్తర సందేశం కలిగిన శుభదినం. క్రియా రూపంలో దైవ ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అద్భుత ప్రక్రియ.

ఇస్లామీయ క్యాలెండరులో చివరి నెల అయిన జిల్‌ హజ్‌ మాసంలోని మొదటి పదిరోజులను ముస్లింలు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ రోజులు ఆధ్యాత్మిక వికాసానికి, ఆత్మప్రక్షాళనకు, సమాజ సంక్షేమానికి మంచి అవకాశం కల్పిస్తాయి. జిల్‌హజ్‌ మొదటి పదిరోజులకు సంబంధించి ఖురాన్, హదీసులలో స్పష్టమైన సంకేతాలున్నాయి. సూరా అల్‌ ఫజ్ర్‌లో, ‘ప్రభాత సమయం సాక్షిగా, పది రాత్రుల సాక్షిగా..’ (ఖురాన్‌ 89:1–2) అని ఉంది. ప్రఖ్యాత ఖురాన్‌ వ్యాఖ్యాత ఇబ్నె కసీర్‌ .. ఈ ప్రస్తావన జిల్‌మాసం పదిరోజులకు సంబంధించినదే అని తఫ్సీర్‌ ఇబ్నె కసీర్‌లో రాశారు. ప్రవక్త (స) వారి ప్రవచనం ప్రకారం, ‘దైవానికి ఈ పదిరోజులలో చేసే మంచి పనులకన్నా ఇతరరోజుల్లో చేసే పనులు ప్రియమైనవి కావు’ (సహీ బుఖారీ, హదీస్‌ 969) అని చెప్పారు. అంటే జిల్‌హజ్‌ మాసం మొదటి పదిరోజులకు ఎంతటి ప్రాముఖ్యం  ఉందో మనకు వీటి ద్వారా అర్థమవుతోంది.

ఈ పదిరోజులలో ఒకటైన తొమ్మిదవ రోజుకు అన్నిటికన్నా ఎక్కువ  ప్రాముఖ్యం ఉంది. హజ్‌ యాత్రలో ఇది అత్యంత కీలకమైన రోజు. హజ్‌కు వెళ్లలేని వారు కూడా ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల గత సంవత్సరం, వచ్చే సంవత్సరం  పాపాలు మన్నింపబడతాయని ప్రవక్త (స) వారు చెప్పారు. ఉపవాసం మనసుని నియంత్రించడంలో, ఆత్మశుద్ధి సాధించడంలో, భయభక్తులు పెంపుదలలో గొప్ప సాధనంగా ఉపకరిస్తుంది.

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌  

 

#

Tags : 1

Videos

కారులో నుండి రాకెట్ షాట్స్.. అప్పుడే న్యూయర్ రచ్చ షురూ జేసిండ్రు

పిల్లలను వెంటాడి చంపేస్తా..! తిరుమలలో సైకో హల్ చల్..

మాచర్లలో చీలిన టీడీపీ

అన్నంత పని చేసిన కిమ్.. షాక్ లో ప్రపంచ దేశాలు

అనంతలో గన్ కల్చర్

శ్రీశైలంలో ఘోరం.. 200 కేజీల మాంసం.. లిక్కర్ స్వాధీనం.. కార్లు సీజ్

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. క్రేజీ అప్డేట్!

నన్ను లక్షకు అమ్మేశాడు.. కాపాడండి సార్

మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఏఎస్సై

భార్యపై అనుమానంతో నిప్పు పెట్టిన భర్త

Photos

+5

కాజల్ అగర్వాల్ డిసెంబరు జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

TTD: అదే నిర్లక్ష్యం.. భక్తుల భద్రత గాలికి.. (ఫొటోలు)

+5

ఈవినింగ్ చిల్ అయిపోతున్న సుప్రీత (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ శివజ్యోతి మరోసారి బేబీ షవర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

క్రిస్మస్‌ వేడుకల్లో సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

ఈ ఏడాది మధుర జ్ఞాపకాలను షేర్ చేసిన సమంత.. (ఫోటోలు)

+5

‘శంబాల’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టీటీడీ ఘోర వైఫల్యం.. భక్తుల ఆగ్రహం (ఫొటోలు)

+5

‘భర్త’ను మరోసారి పెళ్లి చేసుకున్న వీనస్‌ విలియమ్స్‌ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీల క్రిస్మస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)