Breaking News

దంతాలకు ఏ పేస్టు బెటర్‌?.. దంత సమస్యలకు కారణం!

Published on Mon, 11/06/2023 - 12:04

దంతాలకు ఈ పేస్టు/టూత్‌ పౌడర్‌ మంచిదంటూ వివిధ కంపెనీలు పలు ఆకర్షణీయమైన అడ్వర్టైస్‌మెంట్లతో మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇంతకీ వాటిలో ఏది బెటర్‌ అనేది తెలియక జనాలు అవస్థలు మాములుగా ఉండవు. కొందరూ తమ బడ్జెట్‌కి అనుగుణంగా ఉన్నది ఎంపిక చేసుకుంటే ఇంకొందరూ మార్కెట్లోకి వచ్చే ప్రతీ కొత్తరకం పేస్ట్‌ని ట్రై చేసేస్తుంటారు. నిజానికి వాటిలో ఏ పేస్ట్‌ మంచిది. ఇంతలా ఇన్ని రకాల పేస్టుల మార్కెట్లో ఉన్నా.. ప్రజలు దంత సమస్యలను ఇంకా ఫేస్‌ చేస్తూనే ఉంటున్నారు ఎందుకు? తదితరాల గురించి ఆయుర్వేద నిపుణులు నవీన్‌ నడిమింటి ఏం చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం!. 

దంత సమస్యలకు కారణం..

  • ప్రధానంగా కాల్షియం లోపం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి.
  • అలాగే నోటిలోని లాలజలంలో పీహెచ్‌ విలువ ఆహారం తీసుకోక మునుపు 7.4 తర్వాత 5.9 ఉండకపోయినా దంత సమస్య వస్తుంది. 
  • డీ, బీ, సీ విటమిన్‌ లోపం వల్ల చిగుళ్ల వాపు వంటి సమస్యలు వచ్చి దంతాలు వదులుగా మారి సలుపు రావడం వంటి సమస్యలు వస్తాయి.
  • దంతాలు పైన ఉండే ఎనామెల్‌ దెబ్బతినడం వల్ల
  • దంతాల్లో బ్యాక్టీరియా చేరడం తదితరాల వల్ల ఈ దంత సమస్యలు తరుచుగా వస్తుంటాయి. అంతేగాక ఇవి కాస్త గుండె జబ్బులకు దారితీసే ప్రమాదం ఉందని ఆయుర్వేద నిపుణులు నవీన్‌ నడిమింటి హెచ్చరిస్తున్నారు. 

ఇంతకీ ఏ పేస్ట్‌ బెటర్‌!
మార్కెట్లోకి వస్తున్నా రకరకాల పేస్ట్‌లు, పౌడర్‌లు కన్నా వేప పుల్లలు లేదా జామ ఆకులు చాల మంచివి.  ముఖ్యంగా జామా ఆకులతో పళ్లు తోముకుంటే చిగుళ్ల నొప్పులు, పంటి నొప్పులు దంతాల వాపు తదితర పళ్ల సమస్యలు ఉండవు.  ఫలితంగా ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు నవీన్‌ నడిమింటి. ఆయా టూత్‌ పేస్ట్‌లోని రసాయనం కడుపులో వికారం వంటివి కలగజేసి ఆకలి లేకుండా చేస్తున్నాయని చెప్పారు. కొన్ని అయితే వాటిలో ఉండే గాఢత పళ్లకు మంచి చేసే బ్యాక్టీరియాను కూడా నాశనం చేసి పళ్లపై ఉండే ఎనామిల్‌ దెబ్బతినేలా చేస్తున్నాయని అన్నారు. మరొకొన్ని పేస్టులు దంతాలను తెల్లగా మార్చేస్తున్నాయి, కానీ ఇలా దంతాలు ఆకస్మికంగా తెల్లగా కనబడటం కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు సంకేతం కావోచ్చు లేదా ఇతరత్ర దంత సమస్యలకు సంకేతం కూడా అయి ఉండోచ్చని చెబుతున్నారు.

దంత సమస్యలకు నివారణ..
ఇక నోటిలో పుండ్లు వంటి వాటికి ప్రధాన కారణం చవుకబారు నూనెలతో తయారు చేసిన చిరుతిండ్లు తినడం రావొచ్చు లేదా విటమిన్‌ బీ, సీ లోపం వల్ల కూడా రావచ్చని అన్నారు. అందుకోసం సి -విటమిన్, బి-కాంప్లెక్స్ మాత్రలు వాడుతూ తేనె కలిపిన నీటితో నోరు పుక్కిలిస్తే ఈ సమస్య త్వరితగతిన తగ్గిపోతుందన్నారు. దంతాల నొప్పి భరించలేని విధంగా ఉంటే  Vantage అనే పేస్ట్ వాడమని సూచిస్తున్నారు. ఇది పేస్ట్‌గా పళ్లు తోముకోవడానికి వాడకూడదు. కేవలం నొప్పిగా ఉన్న ప్రాంతాల్లో పూస్తే చాలు. ఇది కడుపులోపలికి వెళ్లినా.. ఎలాంటి ప్రమాదం ఉండదు. నొప్పి మరీ తీవ్ర స్థాయిలో ఉంటే..Vantage పేస్ట్‌ తోపాటు కాట్రోల్‌ katorol dt అనే మాత్రను కూడా వాడితే చక్కటి ఫలితం ఉంటుదని చెబుతున్నారు.

---ఆయర్వేద వైద్యులు నవీన్‌ నడిమింటి

(చదవండి: మద్యపాన వ్యసనం మానసిక జబ్బా? దీన్నుంచి బయటపడలేమా?)

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)