Breaking News

రామ్‌ లల్లాకు ఒక గంట విశ్రాంతి!

Published on Sat, 02/17/2024 - 16:33

జనవరి 23న అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ మహోత్సవాన్ని తిలికించేందుకు  దేశ విదేశాల నుంచి ప్రముఖులు, సెలబ్రెటీలు వచ్చిన సంగతి తెలిసిందే. నాటి నుంచి అయోధ్యకు భక్తుల తాకిడి ఎక్కువయ్యింది. అలాగే బాల రాముని దర్శనం కోసం బారుల తీరే భక్తుల సంఖ్య కూడా ఎక్కువ కావడంతో నిర్విరామంగా దర్శనాలకు అవకాశం ఇచ్చారు.

అలాగే రోజు చేసే కైంకర్యాలు, వీటికి తోడు భక్తుల దర్శనలతో బాల రామునికి క్షణం విశ్రాంతి లేకుండా పోయింది. దీన్ని గుర్తించిన ఆలయ ట్రస్ట్‌ బాలరామునికి ఒక గంట విశ్రాంతి ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. రాముడు ఇక్కడ ఐదేళ్ల పిల్లవాడని అందువల్ల ఆయన అధిక ఒత్తిడికి గురిచేయడం సమంజసం కాదని ఆలయ పూజారులు అన్నారు. అందువల్ల రామ్‌ లల్లాకు ఒక గంట బ్రేక్‌ ఇస్తే ఆయన విశ్రాంతి తీసుకుంటారని అన్నారు.

ఈమేరకు ఈ కొత్త షెడ్యూల్‌ శుక్రవారం నుంచి అమలవుతుందని ప్రకటించింది ఆలయ ట్రస్ట్‌. అలాగే ఆలయ రోజువారీ కైంకర్యాల కోసం రాముల వారిని ఉదయం నాలుగు గంటలకే లేపడం నుంచి మొదలై రాత్రి 10 గంటలతో దర్శనాలు ముగుస్తాయి. అలాగే సాయంత్రం రాముల వారికి చేసే ఆచారాల కోసం మరో రెండు గంటలు సమయం కేటాయించారు. ఇలా రాముడు 18 గంటల పాటు ఒత్తడికి గురిచేస్తే తట్టుకోలేరని అన్నారు ఆలయ ట్రస్ట సభ్యులు సత్యేంద్ర దాస్‌ అన్నారు. ఆయన బాల రాముని సౌకర్యార్థం మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు విరామం ఇస్తే ఆయన విశ్రాంతి తీసుకుంటారని అన్నారు సత్యేంద్ర దాస్‌. 

(చదవండి: ఇవాళ నుంచే తాజ్‌ మహోత్సవ్‌ ప్రారంభం! ఎన్ని రోజులు జరుగుతుందంటే..)


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)