Breaking News

జంక్‌ ఫుడ్‌నే జంకేలా..తినడం స్టాప్‌ చేద్దాం ఇలా!

Published on Sat, 07/01/2023 - 17:11

బేకరీలు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, చాట్‌ బండ్లు.. ఎక్కడ చూసినా ఎక్కువ శాతం టీనేజర్లే కనిపిస్తూ ఉంటారు. అంతకంటే చిన్న పిల్లలకు స్వయంగా తల్లిదండ్రులే మురిపెంగా తీసుకువెళ్లి తినిపిస్తుంటారు. అయితే బర్గర్లు, పిజ్జాలు, చాట్‌లు, మిల్క్‌షేక్స్, ఐస్‌క్రీమ్‌లు వంటివి తినటం వల్ల శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరుతుంటాయి. వాటిని కరిగించటానికి సరిపడా వ్యాయామం లేక పిల్లలు ఊబకాయుల్లా తయారవుతున్నారు.

జంక్‌ఫుడ్‌కు అలవాటు పడకుండా ఉండాలంటే ఇంట్లోనే కొత్తరుచుల్లో స్నాక్స్‌ తయారు చేయటం నేర్చుకోవాలి. తక్కువ నూనె, తీపి, మసాలాలతో రుచికరమైన స్నాక్స్‌ చేసి పెడితే ఫాస్ట్‌ ఫుడ్స్‌కు పిల్లలు ఆకర్షితులవకుండా ఉంటారు. ఏ అలాగే ఆహారంలో తగినంత పీచు పదార్థం ఉండేలా చూసుకుంటే ప్రొటీన్‌ ఫుడ్‌ వల్ల మలబద్ధకం తలెత్తకుండా ఉంటుంది.

ఏ అల్పాహారంలో బ్రెడ్, శాండ్‌విచ్‌లకు బదులు గోధుమ రవ్వతో చేసిన ఉప్మా, పెసలతో చేసిన పొంగల్, పెసరట్టు, రాగి, క్యారట్‌ ఇడ్లీ లాంటివి ఇవ్వాలి. ఏ బాదం, పిస్తా, వాల్‌నట్స్, ఉడకబెట్టిన సెనగలు, మొలకలు అందుబాటులో ఉంచాలి. ఏ ఫ్రిజ్‌ ట్రేలలో చాక్లెట్లు, బిస్కెట్లకు బదులు తాజా పండ్లు, సలాడ్లు, పాలు, గుడ్లు, పళ్లరసాలు, చెరుకు రసం, టమాటా రసం లాంటివి ఉండాలి. ఏ పిల్లలు ఎక్కువగా ఆటలాడుతూ ఉంటారు కాబట్టి రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్‌ తినేలా చూసుకోవాలి. ఏ ఉడికించిన సెనగలు, బొబ్బర్లు ఎక్కువ సమయంపాటు శక్తినిస్తాయి కాబట్టి ఔట్‌ డోర్‌ గేమ్స్‌ ఆడే పిల్లలకు వీటిని శ్నాక్స్‌గా ఇస్తూ ఉండాలి. 

జంక్‌ ఫుడ్‌ నుంచి రక్షించుకోవాలంటే..?
పెద్ద వాళ్ళు జంక్‌ ఫుడ్స్‌ తింటూ, కాఫీలు, టీలు తాగేస్తుంటే వారిని చూస్తూ పెరిగే పిల్లలు అదే అలవాటు చేసుకుంటారు. అందువల్ల అలాంటి వాటిని ముందు పెద్దలు మానేయాలి. పెద్దవాళ్ళు పండ్లు, డ్రై ఫ్రూట్స్‌ తింటూ ఉంటే పిల్లలు కూడా అవే తింటారు. నిమ్మరసం, క్యారెట్‌ రసం, బీట్రూట్‌ రసం  రోజూ తీసుకోండి. పిల్లలు కూడా అవే ఇష్టపడతారు.  

(చదవండి: డయాబెటిస్‌ పేషెంట్స్‌కి ఈ వ్యాధుల ఎటాక్‌ అయితే..డేంజర్‌లో ఉన్నారని అర్థం!)

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)