విద్యార్థినులకు ఫ్రీ

Published on Tue, 07/14/2026 - 06:18

‘ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు ఉచిత ప్రయాణం’ అని రాసి ఉన్న గులాబీ రంగు ఆటో అందరినీ ఆకర్షిస్తుంటుంది. చెన్నైలోని టి.నగర్, కోడంబాక్కం, అన్నానగర్, పెరంబూర్‌ప్రాంతాలలో గత కొన్ని సంవత్సరాలుగా తన ఆటోలో అమ్మాయిలను ఉచితంగా తీసుకువెళుతోంది రాజీ అశోక్‌...

‘మేము మా చదువు పూర్తి చేసి ఉంటే మా జీవితాలు బాగుండేవి’ గతాన్ని గుర్తుచేసుకుంటూ అంటుంది రాజీ. ఆర్థిక సమస్యల కారణంగా కాలేజీ చదువును అర్థంతరంగా మానేయాల్సి వచ్చింది చెన్నైకి చెందిన రాజీ అశోక్‌. తనలాగే ఎవరూ చదువు మధ్యలో మానెయ్యకుండా ఉండడానికి తనవంతు సహాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది 54 ఏళ్ల రాజీ.

అక్క కనిపిస్తే... ఎంత ఆనందమో!
ప్రతిరోజు ఉదయం విద్యార్థినులను బడిలో దింపడంతో పాటు సాయంత్రం బడి నుంచి తీసుకువస్తుంటుంది రాజీ. రోజూ పది నుంచి పదిహేనుమంది బాలికలకు సహాయం చేస్తుంది. ఇలా చేయడం అంటే తన సంపాదనలో ఎంతో కొంత మొత్తాన్ని వదులుకోవడమే. అయితే అదేమీ తనకు ఇబ్బందిగా లేదు. ‘స్కూల్, బస్‌స్టాప్, ఆటోస్టాండ్‌ల దగ్గర పిల్లల కోసం ఎదురుచూస్తాను. గులాబీ రంగు ఆటోను గుర్తు పట్టి వెంటనే ఎక్కేస్తారు. నన్ను చూడగానే వారికి సంతోషంగా ఉంటుంది. సౌకర్యంగా కూర్చుంటారు. కొందరు ఇంటికి వెళ్లే దారిలో ఆటోలోనే నిద్రపోతారు. ఆకలి వేస్తే తినడానికి నా ఆటోలో బిస్కెట్‌ ప్యాకెట్లు ఎప్పుడూ ఉంటాయి’ అంటుంది రాజీ.

అంతులేని ఆనందం
‘అక్కా... నన్ను గుర్తు పట్టావా? ఒకసారి నీ ఆటోలో నన్ను తీసుకెళ్లావు!’
‘నీ గురించి మా అమ్మాయి ఎన్నిసార్లు చెప్పిందో’... ఇలాంటి మాటలు విన్నప్పుడు రాజీకి వెయ్యి ఏనుగుల బలం, అంతులేని ఉత్సాహం వస్తుంది.

ఇంకా ఏదైనా చేయాలని అనిపిస్తుంది. ‘సేవ చేయడంలో ఉన్న అంతులేని ఆనందం మరో దాంట్లో దక్క లేదు. ఈ ప్రయాణంలో ఎందరినో కలిశాను. వారి భావాలను పంచుకున్నాను. ఒక టీవీ ఛానల్‌ అవార్డుల సమయంలో ఒక యువతి వచ్చి నేను కూడా రాజీ అక్క ఆటోలో ప్రయాణించాను అని చెప్పడం సంతోషంగా అనిపించింది.

నేను రాజీ అక్క ఆటోలో ప్రయాణించాను... అంటూ ఎంతో మంది సామాజిక మాధ్యమాలలో పోస్ట్‌లు పెడుతుంటారు. అవి చదివిన వారు నా గురించి ప్రశంసపూర్వకంగా కామెంట్స్‌ పెడుతుంటారు. ఆ కామెంట్స్‌ నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. నా వయసు 54 ఏళ్లు. ఇక స్వస్థలానికి వెళ్లి పోదామని నిర్ణయించుకొని వెళ్లాను. 

అక్కడకు వెళ్లినా మనసు మాత్రం చెన్నైను వదల లేదు. దీంతో మళ్లీ వచ్చేశాను. నా భర్త కేరళలో ఒక సంస్థ ఇచ్చిన అంబులెన్స్  ద్వారా ఫ్రీ సర్వీసు చేస్తుండటం, చెన్నైలో నేను నా వంతు సేవ చేయడం మనస్సుకు ఎంతో ఆనందంగా ఉంది. గతంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత సైతం నన్ను అభినందించడం మరిచిపోలేని జ్ఞాపకం. ప్రస్తుతం నేను ఒక చిన్న పాటి ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతున్నాను. కొంచెం పెద్ద ఆటో ఉంటే, ప్రతి రోజూ మరి కొంత మంది అమ్మాయిలకు సేవలు అందించేందుకు వీలుంటుంది’ అంటుంది రాజీ అశోక్‌.

– అస్మతీన్‌ మైదీన్, సాక్షి, చెన్నై

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)