Breaking News

పుస్తకాన్ని ప్రేమిద్దాం... విజ్ఞానాన్ని దోచేద్దాం!

Published on Sat, 08/09/2025 - 10:04

కర్నూలు కల్చరల్‌: పుస్తక పఠనంతో సంపూర్ణ పరిజ్ఞానం సిద్ధిస్తుంది. పుస్తకాల అధ్యయనం ఒక తపన. తీరని విజ్ఞాన దాహం. పుస్తకాలకు పుస్తక ప్రియులకు ఉండే అనుబంధం బలీయమైంది. పుస్తకాన్ని తమ జీవితాన్ని ఆదర్శంగా ముందుకు నడిపించే నిజమైన స్నేహితుడిగా.. మార్గదర్శకుడిగా భావిస్తారు. కొత్త పుస్తకం వచ్చిందంటే ఇంట్లో గ్రంథాలయంలో ఉండాల్సిందే. ఆర్థిక స్తోమత లేక కొన్ని పుస్తకాలు కొనలేకపోయినా ఏ గ్రంథాలయంలోనో స్నేహితుల వద్దో సంపాదించి చదివేదాక వారికి నిద్ర పట్టదు. ఇలాంటి గొప్ప అనుబంధాన్ని పెంచుకున్న పుస్తక ప్రియుల కోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ‘పుస్తక ప్రేమికుల దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. అయితే నేటి ఆధునిక సాంకేతి పరిజ్ఞానం పరుగుల్లో పుస్తక పఠనం బాగా తగ్గిపోయిందని.. ఇది సమాజంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుస్తక పఠనం పెంచేలా చర్యలు చేపట్టాల్సి ఉందని అభిప్రాయ పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలులో జిల్లా కేంద్ర గ్రంథాలయం ఒకటి, 58 గ్రంథాలయ శాఖలు, ఒకటి గ్రామీణ గ్రంథాలయం ఉంది. సుమారు 150 పుస్తక సంక్షిప్త కేంద్రాలు ఉన్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు ఇతర గ్రంథాలయాల్లో  6,50,400 పుస్తకాలు ఉన్నాయి. కేంద్ర గ్రంథాలయంలో 10 వేల మంది, మిగతా వాటిల్లో 70 వేల  మంది శాశ్వత సభ్యులు ఉన్నారు. కేంద్ర గ్రంథాలయంలో ప్రతి రోజు సుమారు 450 మంది  పఠనం చేస్తుంటారు.  

విద్యార్థి దశలోనే అలవాటు చేయాలి 
మేధావుల అనుభవాలకు అక్షర రూపం పుస్తకం. ఇవి పాఠకుల్లో జ్ఞానాన్ని, నైతిక విలువలను పెంపొందిస్తాయి. విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందిస్తూ మంచి మిత్రునిలా తోడుండి సమాజాన్ని అర్థం చేసుకోవడానికి సహాయ పడతాయి. విద్యార్థులు సెల్‌ఫోన్లకు బానిసలుగా మారకుండా నిరంతరం సామాజిక మాధ్యమాల్లో మునిగిపోయి చుట్టూ ఉన్న మనుసులతో సంబంధాలు కోల్పోకుండా పుస్తకాలు కాపాడతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యార్థి దశ నుంచే పుస్తకాలు చదివించడం గ్రంథాలయాలకు తీసుకొని వెళ్లడం అలవాటు చేయాలి.    – డాక్టర్‌ ఎం. హరికిషన్, ఉపాధ్యాయులు, బాలల కథా రచయిత  

పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలి 
గ్రంథాలయాల్లో అన్ని వయస్సుల వారికి అవసరమైన పుస్తకాలు లక్షల్లో అందుబాటులో ఉన్నాయి. పాఠ్యాంశాలకు సంబంధించినవే కాకుండా విజ్ఞానాభివృద్ధికి ఉపయోగపడే పుస్తకాలు చదివేలా విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి.జిల్లా కేంద్ర గ్రంథాయలంలో ఏసీ స్టడీ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చాం. పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించేందుకు  తరచుగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన పోలీస్‌ ఉద్యోగ నియామకాల్లో గ్రంథాలయాన్ని సది్వనియోగం చేసుకున్న 13 మంది ఉద్యోగాలు సాధించారు. – కె. ప్రకాష్‌, కార్యదర్శి, జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ
 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)