Breaking News

పాపాయితోనే మాస్టర్స్‌..కానీ గ్రాడ్యుయేషన్ ఈవెంట్‌కి డబ్బుల్లేక అలా చేశా!

Published on Mon, 10/13/2025 - 16:32

కష్టపడి చదువుకోవడం ఒక ఎత్తైతే, ఆ సర్టిఫికెట్‌ను అందుకోవడం మరో ఎత్తు. గ్రాడ్యుయేషన్ విద్యార్థుల​ జీవితాల్లో, కరియర్‌లో అదొక అద్భుతమైన అనుభూతి. గ్రాడ్యుయేషన్ డ్రెస్‌లో తోటివారితో పాటు వేదికపై నిలబడటం, హితులు, సన్నిహితుల సమక్షంలో గర్వంగా పట్టా పుచ్చుకోవడం అనేది చాలా అరుదుగా సాధించగల అనుభూతి. కానీ అలాంటి ఆనందాన్ని మిస్‌ అవడం నిజంగా చెప్పలేనంత దురదృష్టమే. అలాంటి అనుభవాన్ని డిజిటల్‌ క్రియేటర్ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఇది నెట్టింట పలువురి హృదయాలను  దోచుకుంది.

డిజిటల్  క్రియేటర్‌, రషికా ఫజాలి తన గ్రాడ్యుయేషన్‌ అనుభవాన్ని పంచుకున్నారు.  గ్రాడ్యుయేషన్‌ ఈవెంట్‌లో పాల్తొనాలనే ఆమె డ్రీమ్‌ సాకారం కాలేదు.కేవలం ఆర్థిక సమస్యల కారణంగా దాన్ని మిస్‌ అయ్యానని  చెప్పుకొచ్చింది.  ఆరోజు కేవలం  జనంలో అతిథిగా కూర్చోవాల్సి వచ్చిందంటూ హృదయాన్ని కదిలించే స్టోరీ షేర్‌ చేశారు.

"నేను నా స్వంత గ్రాడ్యుయేషన్‌కు అతిథిగా ఉన్నాను" అనే శీర్షికతో ఇన్‌స్టాగ్రామ్‌లోచేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.  అప్పట్లో ఆ వేడుకకు డబ్బు చెల్లించడం కంటే నెల గడవడమే  తనకు ముఖ్యమని ఫజాలి పేర్కొన్నారు.  నిజంగా ఆ  క్లోక్  ధరించాలని చాలా కోరిక ఉండేదని,  కానీ మిస్‌ అవ్వడం తీపి చేదు కలయిక క్షణాలని, వేడుకకు అతిథిగా హాజరు కావాలనే తన నిర్ణయం  అత్యంత దారుణమైందని గుర్తు చేసుకున్నారు. అయితే తనను ప్రోత్సహించిన  తన తోటివారిని అభినందించే అవకాశం వచ్చినందుకు సంతోషించాననీ,  కనీసం ఆ ​ ఆనంద జ్ఞాపకాలు  తనలో మిగిలాయని చెప్పుకొచ్చారు. 

బిడ్డకు తల్లిగా
ఒక బిడ్డకు తల్లిగా  క్లిష్టమైన బాధ్యతలను నిర్వర్తిస్తూనే   రషికా మెరిట్‌తో పట్టభ్రదురాలైంది.  రిసెర్చ్‌లో డిస్టింక్షన్‌ తెచ్చుకుంది. అదీ చిన్ని పాపాయిని ఎత్తుకుని  ఎవరి సాయం లేకుండానే, మాస్టర్స్ సాధించానంటూ గర్వంగా చెప్పుకుంది. దీంతో నెటిజన్లు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు.

 

అయ్యో... అప్పుడు తమకీ విషయం తెలిసి ఉంటే, సాయం  చేసేవారమని చాలామంది కమెంట్‌ చేశారు. "ఎంత గొప్ప విజయం!  భవిష్యత్తులో ఇంకా సాధిస్తారు! అలా కూర్చోవడానికి చాలా ధైర్యం అవసరం! అని ఒకరు, ‘‘గ్రాడ్యుయేషన్‌కు అభినందనలు  మీరు నిజంగా క్వీన్‌," మరొకరు కామెంట్‌ చేశారు. నాకు తెలిసి ఉంటే కచ్చితంగా సాయం చేసే దాన్ని.. సాయంగానో, ఉపకారంగానో కాదు ఒకబిడ్డకు తల్లిగా ఇది  సాధించడంఎంత కష్టమో  తెలుసు అన్నారు మరొకరు.

Videos

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)