Breaking News

దేవుడా..!ఇదేం పిచ్చి..చర్మ సంరక్షణ కోసం..ఏకంగా పక్షి లాలాజలంతో..!

Published on Wed, 07/10/2024 - 11:53

ఇటీవల గ్లామరస్‌గా ఉండటంపై వ్యామోహం మాములుగా లేదు. ఇదివరకు ఎవరో అక్కడక్కడ అందంపై శ్రద్ధ పెట్టేవారు. అందుకోసమని మరి ఇంతలా ప్రయాస పడేవారు కాదు. కానీ ఇప్పుడూ అందం అనేది అతిపెద్ద స్టేటస్‌. అందుకోసం ఎంత డబ్బులైనా వెచ్చిచ్చేందుకు వెనకాడటం లేదు. ముఖ్యంగా ఎలాంటి వెర్రిపనులు చేసేందుకైనా సై అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే చాలా విచిత్రమైన సౌందర్య సాధానాలు వస్తున్నాయి. అలాంటి బ్యూటీ ప్రొడక్టే ఈ ఆసియా పక్షి లాలాజల సూప్‌. అసలు ఏంటిది? పక్షి లాలాజలంతో సూప్‌ ఎలా చేస్తారు? మంచిదేనా..?

దీన్ని "బర్డ్స్‌ నెస్ట్‌ సూప్‌" అని కూడా అంటారు. చైనా, తైవాన్‌, హాంకాంగ్‌, సింగపూర్‌ వంటి ప్రాంతాల్లో చేస్తారు. గట్టిపడిన పక్షి ఉమ్మి గూళ్లతో తయారు చేస్తారు. ఇది వృద్ధాప్య లక్షణాలను దరిచేరనివ్వదు. పైగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీన్ని ఈస్ట్‌ కేవియర్‌ అని కూడా పిలుస్తారు. 

ఎలా తయారు చేస్తారంటే..
ఇది స్విఫ్ట్‌లెట్స్‌ అనే పక్షి జాతికి చెందిన తినదగిన గూడు. ఈ పక్షి ఎక్కువగా ఆగ్నేయా తూర్పు ఆసియాలోనే కనిపిస్తుంది. ఈ స్విఫ్ట్‌లెట్స్‌ పక్షులు తమ లాలాజలంతో గూళ్లను తయారు చేస్తాయి. ఇవి గూళ్లను తయారు చేసేందుకు కొమ్మలు, ఈకలను వినియోగించదు. వీటిని మార్కెట్లో విక్రయిస్తారు. ఆ గూళ్లు ఎరుపు, తెలుపు, బంగారు వర్ణంలో ఉంటాయి. 

ప్రతిఒక్క గూడుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రజలుగా బాగా విశ్వస్తారు. ప్రస్తుతం సోషల్‌ మీడియా పుణ్యమా..! అని చర్మ సంరక్షణకు సంబంధించిన పక్షి ఉమ్మి గూడు సూప్‌ గురించి అందరికీ తెలిసింది. అయితే దీన్ని కొనుగోలు చేయడం అందరివల్ల కాదు. ఎందుకంటే..? 500 గ్రాములే ఏకంగా రూ. 1,60,000/- పలుకుతుంది. 

ఈ లాలాజల పక్షి గూళ్లతో తయారు చేసిన కొల్లాజెన్‌ సప్లిమెంట్స్‌ కూడా మార్కెట్లో విక్రయిస్తున్నారు. యూఎస్‌లో దీనికి సంబంధించిన గోల్లెన్‌ నెస్ట్‌ అనే షాపును 1996లో ఏర్పాటయ్యింది కూడా. ఇక్కడ ఈ పక్షి గూడును ప్రధాన పదార్ధంగా చేసే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.

ప్రయోజనాలు..

  • పోషకాలు సమృద్ధిగా ఉంటాయి

  • అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, కాల్షియం, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి

  • కణాల పునరుత్పత్తికి, మరమత్తుకు మంచిది

  • రోగనిరోదక వ్యవస్థను పెంచుతుంది. 

  • అంటువ్యాధులను నిరోధించడంలో సహాయపడుతుంది

కొల్లాజెన్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని చైనా ప్రజల నమ్మకం. నిజానికి ఇది నిజమని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రియ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. సాంప్రదాయ చైనీస్‌ ఔషధం ప్రకారం ఈ పక్షి గూడు యవ్వన రూపాన్ని ఇస్తుందనేది ప్రజల నమ్మకం మాత్రమేనని తేల్చి చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు దీనివల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని అంటున్నారు. 

అవేంటంటే..

  • పక్షి లాలాజల ప్రోటీన్లు లేదా గూడు కలుషితమైతే అలెర్జీ ప్రతిచర్యలను కలిగి ఉండవచ్చు.

  • హార్వెస్టింగ్ మరియు ప్రాసెసింగ్ పద్ధతుల రీత్యా పక్షి గూడుని పరిశుభ్రంగా నిర్వహించకపోతే బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాల వంటి కలుషితాలను కలిగి ఉండవచ్చు.

  • ఆ గూళ్లను నిర్మించుకునే వాతావరణాన్ని బట్టి భారీ లోహాలతో కలుషితం అయ్యే ప్రమాదం కూడా ఉంది.

     

(చదవండి: ప్రపంచంలోనే తొలి మిస్‌ ఏఐ కిరీటాన్ని దక్కించుకున్న మొరాకో ఇన్‌ఫ్లుయెన్సర్‌..!)

 

#

Tags : 1

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)