Breaking News

కళ‘నైనా’ కనని, కాలం చెల్లని : సహనం నుంచి సంకల్పబలం వరకు!

Published on Sat, 09/21/2024 - 10:58

కొన్ని దశాబ్దాల క్రితం...నైనా దలాల్‌ వేసిన చిత్రాలు ఆనాటి కళాభిమానులకు షాకింగ్‌గా అనిపించాయి. ఆమె చిత్రాలు కాలం కంటే చా...లా ముందు ఉండడమే దీనికి కారణం.

లండన్‌లో వెస్ట్రన్‌ ఆర్ట్‌ను అధ్యయనం చేసిన తొలి భారతీయ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన తొంభై సంవత్సరాల నైనా దలాల్‌ సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ న్యూ దిల్లీలోని ట్రావెన్‌ కోర్‌ హౌస్‌లో జరుగుతోంది. సాధారణ ప్రజల కథలను చెప్పడమే లక్ష్యంగా నైనా దలాల్‌ కుంచె సామాన్యుల జీవితాల్లోకి వెళ్లింది. ఆమె చిత్రాలలో నాస్టాల్జీయా తొంగి చూస్తుంది. 

 ‘నైనా దలాల్‌ ఆర్ట్‌ వర్క్‌ను చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు’ అంటారు కొద్దిమంది విశ్లేషకులు. కామన్వెల్త్‌ స్కాలర్‌షిప్‌ అందుకొని లండన్‌కు వెళ్లింది దలాల్‌. లండన్‌లో వెస్ట్రన్‌ ఆర్ట్‌ను అధ్యయనం చేసిన మొదటి భారతీయ ఆర్టిస్ట్‌గా తన ప్రత్యేకత చాటుకుంది. నైనా దలాల్‌ ప్రింట్‌ మేకింగ్‌ కోర్సులో చేరినప్పుడు చాలామంది ఆశ్చర్య΄ోయారు. ఎందుకంటే ప్రింట్‌ మేకింగ్‌ అనేది పురుషాధిక్య మాధ్యమంగా గుర్తింపు  పొందింది. భారీ యంత్రాలతో పనిచేయాల్సి వచ్చేది. అయితే నైనా దలాల్‌ అసాధారణ ప్రతిభ ముందు అపోహలు నిలబడలేక పోయాయి.

 

ఫెమినిజంకు సంబం«ధించి ఫస్ట్‌ వేవ్‌ బలాన్ని సంతరించుకుంటున్న కాలంలో, మన దేశంలోని మహిళా కళాకారులు ఫెమినిస్ట్‌ భావాలతో స్ఫూర్తి ΄÷ందుతున్న కాలంలో ఆమె తన కుంచెను బలమైన మాధ్యమంగా ఉపయోగించింది. మాతృత్వం నుంచి ఒంటరితనం వరకు తన చిత్రరచనకు నైనా ఎన్నో ఇతివృత్తాలు ఎంచుకుంది.

బెంచీలు, బూట్లు, రాళ్లు, గోడలు, కొండలలాంటి నిర్జీవమైన వాటి నుంచి జంతువులు, పక్షుల వరకు ఆ చిత్రాలలో కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ వాటితో తమ జ్ఞాపకాలను పంచుకునేలా చేస్తాయి. ఆ జ్ఞాపకాలు ఒక వ్యక్తికి మరో వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. నైనా దలాల్‌ను ఇతర ప్రముఖ భారతీయ మహిళా కళాకారుల నుండి వేరు చేసిన అంశం ప్రింట్‌ మేకింగ్‌తో చేసిన లిథోగ్రాఫ్, కొలాగ్రాఫ్‌లు. 1960లో నైనా దలాల్‌ లండన్‌కు మకాం మార్చింది. ఇండియాలో ఉన్నప్పుడు స్పాన్సర్‌ షోల కంటే సొంత ఆర్ట్‌ షోలే ఎక్కువ చేసింది. 

‘నైనా దలాల్‌ వివిధ మాధ్యమాల్లో వందలాది చిత్రాలను సృష్టించింది. ఈ ప్రదర్శన ఒక మినీ–రెట్రోస్పెక్టివ్‌ లాంటిది’ అంటున్నారునైనా దలాల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ నిర్వాహకులు.

మహిళల గురించిన నా ఆలోచనలు కాలంతోపాటు మారుతూ వచ్చాయి. అవి నా చిత్రాల్లో ప్రతిఫలిస్తాయి. మహిళల్లో ఉండే సహనం నుంచి సంకల్పబలం వరకు ఎన్నో వెలుగులు నా చిత్రాల్లో కనిపిస్తాయి. నా కళలో కాల్పనిక విషయాలు కనిపించవు. నా చుట్టూ కనిపించే సాధారణ ప్రజల జీవితాలే కనిపిస్తాయి. శ్రామిక జీవుల గురించి చదివినప్పుడు, విన్నప్పుడు వారికి సంబంధించిన ఆలోచనలు నా మనసులో సుడులు తిరుగుతుంటాయి. ఆ అలజడిని నా చిత్రాల్లోకి తీసుకువస్తుంటాను. నా కళ వారికి గొంతు ఇస్తుందని అనుకుంటున్నాను.
– నైనా దలాల్‌
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)