Breaking News

బ్లాక్‌హెడ్స్‌తో బాధపడుతున్నారా? ఈ డివైస్‌ ఉంటే నో ప్రాబ్లమ్‌

Published on Tue, 07/25/2023 - 16:36

బ్లాక్‌హెడ్స్‌..  సౌందర్యాభిలాషులకు పెద్ద సమస్యే! ముక్కు, గడ్డం, నుదురు.. ఇలా ప్రతిచోట పుట్టుకొచ్చే బ్లాక్‌హెడ్స్, చర్మాన్ని కళావిహీనంగా మార్చేస్తాయి. అయితే వాటిని తొలగించుకోవడానికి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇప్పుడు.. మార్కెట్‌లో చాలా డివైస్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ చిత్రంలోని క్లీనర్‌ కాస్త ప్రత్యేకమైంది. బ్లాక్‌హెడ్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకునేటప్పుడు.. ఏ చర్మం మీదైతే ట్రీట్‌మెంట్‌ జరుగుతుందో.. ఆ చర్మాన్ని ఫోన్‌ స్క్రీన్‌ మీద క్లియర్‌గా చూసుకోవచ్చు. దాంతో క్లీనింగ్‌ సులభమవుతుంది. అందుకు ఈ మెషిన్‌కి బ్లూటూత్‌ కనెక్ట్‌ చేసుకునే వీలుంటుంది.

వాక్యూమ్‌ హోల్‌లో చిక్కిన చర్మం అద్దంలో కనిపించదు కాబట్టి ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. ఈ మెషిన్‌కి నాలుగు ఇంటర్‌చేంజ్‌ హెడ్స్‌ లభిస్తాయి. వాటిని డివైస్‌కి అమర్చుకునే చోటే.. మాగ్నిఫికేషన్‌ డిస్‌ప్లే హై–డెఫినిషన్‌ లెన్స్‌తో ఒక కెమెరా ఉంటుంది. దాంతోనే ఫోన్‌లో చర్మం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విజువల్‌ ఫేషియల్‌ బ్లాక్‌హెడ్‌ వాక్యూమ్‌ క్లీనర్‌.. కూలింగ్‌ అండ్‌ హీటింగ్‌ కంప్రెస్‌ ఫంక్షన్‌ తో పని చేస్తుంది. ఇది 40 డిగ్రీల సెల్సియస్‌ హీటింగ్‌ ఫంక్షన్‌తో.. బ్లాక్‌ హెడ్స్‌ లాగిన తర్వాత.. ఆ రంధ్రాలు పెద్దవి కాకుండా చర్మం కూడుకునేలా చేస్తుంది. దీనిలోని కూలింగ్‌ ఆప్షన్‌ చర్మాన్ని చల్లబరుస్తుంది.

సాఫ్ట్, నార్మల్, స్ట్రాంగ్‌ అనే ఆప్షన్స్‌తో ఈ మెషిన్‌ వినియోగించడానికి చాలా సులభంగా ఉంటుంది. మొదట హెడ్స్‌ మార్చుకుని బ్లాక్‌ హెడ్స్‌ తొలగించుకున్నాక.. వెనక్కి తిప్పి.. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో రూపొందిన మసాజర్‌తో ఆ ప్రదేశాన్ని మసాజ్‌ చేసుకోవాలి. దానికే హాట్‌ అండ్‌ కూల్‌ ఆప్షన్‌ అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. దీనికి ఎప్పటికప్పుడు చార్జింగ్‌ పెట్టుకుని.. వైర్‌లెస్‌ డివైస్‌గా వాడుకోవచ్చు. 

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)