Breaking News

‘రారండోయ్‌..వేడుక చేద్దాం’..! మంచి ముహూర్తాల తేదీలు ఇవే..!

Published on Wed, 04/16/2025 - 14:00

ముహూర్తాల కోసం వేచి చూస్తున్న వారికి తీపి కబురు అందింది. మండు వేసవిలో శుభఘడియలు వచ్చాయి. ఏప్రిల్, మే, జూన్‌ మాసాల్లో శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో తెలుగింట ‘రారండోయ్‌..వేడుక చేద్దాం’ అంటున్నారు. వరుసగా మంచిరోజులు రావడంతో పెళ్లి మండపాలు, బ్యాండ్‌ మేళాలకు డిమాండ్‌ ఏర్పడింది. పురోహితులు, వంట మనుషులు, వీడియో గ్రాఫర్లకు, ఆర్డర్లు తలుపు తడుతున్నాయి.

ముహూర్తాలు ఇవే..
ఏప్రిల్‌లో 16, 18, 20, 23, 30 తేదీల్లో, మే నెలలో 1, 4, 8, 9, 10, 11, 14, 16, 18, 21, 23, 28, 30, 31 తేదీల్లో, జూన్‌ నెలలో 2, 4, 5, 6, 7, 8 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని వేదపండితులు చెబుతున్నారు. జూన్‌ 11 నుంచి జూలై 12 వరకు మూఢం రావడంతో ముహూర్తాలకు కొంత విరామం వచ్చింది. తిరిగి మళ్లీ శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు మొదలు కానున్నాయి. ఏది ఏమైనా ఈ ఏడాది విశ్వావసు నామ సంవత్సరంలో శుభముహూర్తాలు ఎక్కువగా ఉండడంతో పెళ్లిళ్లు కూడా ఎక్కువగానే జరుగనున్నాయి.

మూణ్నెళ్లు శుభఘడియలు
మూడు నెలలపాటు ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరుపుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ నెల 30న అక్షయ తృతీయ రావడంతో ఆరోజు దివ్యమైన ముహూర్తం ఉంది. నిశ్ఛయ తాంబూలాలు పుచ్చుకున్నవారు వేడుకలకు సిద్ధమవుతున్నారు.
– గొల్లపెల్లి రామానందాచార్య స్వామి, వేదపండితులు

(చదవండి: వేసవి తాపం నుంచి రక్షించే సహజ ఆరోగ్య పానీయాలివే..!)

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)